iDreamPost
android-app
ios-app

నాని చేసింది తప్పు కాకపోవచ్చు! శర్వా మాత్రం తప్పు చేయలేదు!

  • Author ajaykrishna Published - 01:28 PM, Sat - 19 August 23
  • Author ajaykrishna Published - 01:28 PM, Sat - 19 August 23
నాని చేసింది తప్పు కాకపోవచ్చు! శర్వా మాత్రం తప్పు చేయలేదు!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించాలని ఎంతోమంది యంగ్ స్టర్స్ కి బిగ్ డ్రీమ్. కానీ.. అవకాశాలు అందరికీ రావు. వచ్చినవాళ్లు ఎంతవరకు దక్కించుకున్నారు అనేది పాయింట్. సూపర్ స్టార్ సినిమా అంటే.. ఖచ్చితంగా పాన్ ఇండియా ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటాయి. అందులోనూ ఇప్పుడు జైలర్ సినిమా సక్సెస్ తో బాక్సాఫీస్ రికార్డులు సెట్ చేస్తున్నాడు రజినీ. ఈ క్రమంలో తదుపరి సినిమాని జై భీమ్ ఫేమ్ టిజే జ్ఞానవెల్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో రజినీతో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

ఇండియన్ సూపర్ స్టార్స్ అయినటువంటి రజినీకాంత్, అమితాబ్ బచ్చన్.. ఇద్దరు ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమాపై అంచనాలు, హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. పైగా జ్ఞానవెల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసే డైరెక్టర్ కాదు. ఆయన కథాకథనాలు అన్ని రియలిస్టిక్ గా.. కొత్తగా సోషల్ ఎలిమెంట్స్ తో కూడి ఉంటాయి. జ్ఞానవెల్ సినిమా అంటే.. ఓ మంచి కథాంశం ఉంటుందని అంచనా వేయొచ్చు. ఇక ఈ సినిమాలో విలన్ రోల్ లో టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట నాని దగ్గరికి వెళ్లిన ఆ రోల్.. నాని రిజెక్ట్ చేయడంతో శర్వానంద్ ను చేరిందట. ఇక సినిమాలో అటు రజినీకి, ఇటు అమితాబ్ ఇద్దరికీ కూడా శర్వా విలన్ గా కనిపించబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

ఇదిలా ఉండగా.. రజినీ సినిమా ఆఫర్ ని నాని రిజెక్ట్ చేయడంలో తప్పు లేదని అంటున్నారు. మరోవైపు శర్వా ఆ రోల్ ఓకే చేసి మంచి పని చేశాడని మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఏంటంటే.. నాని సొంతంగా స్టార్ గా ఎదిగాడు. ఈ ఏడాది దసరా మూవీతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో తదుపరి సినిమాలు కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే క్రమంలో.. నెగిటివ్ రోల్ కి నో చెప్పి ఉండొచ్చు లేదా రజినీ అభిమానిగా ఆయనకే విలన్ గా చేయడం ఇష్టం లేక నో అన్నాడు కావచ్చని సమాచారం. కానీ.. రజినీ సినిమా విషయంలో శర్వానంద్ తీసుకున్న చాలా మంచిదని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే.. శర్వా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ.. ఇంకా సరైన బిగ్ బ్రేక్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఈ టైమ్ లో రజినీ, అమితాబ్ లాంటి లెజెండ్స్ కి విలన్ గా చేయడం అంటే.. ఖచ్చితంగా శర్వా కెరీర్ కి ఆ రోల్ మంచి మైలేజ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించే అవకాశం ఉంది. సో.. శర్వా ఈ సినిమాలో విలన్ గా ఓకే చేయడం కరెక్ట్ నిర్ణయం అని ఫ్యాన్స్ తో పాటు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి శర్వా నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.