iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాలలో షారుఖ్ క్రేజ్! జవాన్ బిజినెస్ ఎన్ని కోట్లంటే..?

  • Author ajaykrishna Published - 02:09 PM, Tue - 1 August 23
  • Author ajaykrishna Published - 02:09 PM, Tue - 1 August 23
తెలుగు రాష్ట్రాలలో షారుఖ్ క్రేజ్! జవాన్ బిజినెస్ ఎన్ని కోట్లంటే..?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది పఠాన్ మూవీతో ఊహించని విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాప్ లతో దాదాపు నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయిన షారుఖ్.. సాలిడ్ కంబ్యాక్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. అద్భుతమైన విజువల్స్.. యాక్షన్ ప్యాకెడ్ సీక్వెన్స్ లతో పాటు స్టైలిష్ మేకోవర్ తో థియేటర్స్ లో సందడి చేశాడు. కట్ చేస్తే.. పఠాన్ మూవీ బాలీవుడ్ కి ఊపు తీసుకొచ్చింది. దాదాపు రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి.. బాలీవుడ్ లో మళ్లీ ఆశలు చిగురించేలా చేసిందని చెప్పుకోవచ్చు. పఠాన్ తెచ్చిన ఊపుతో ఇప్పుడు షారుఖ్ చేసిన కొత్త సినిమా జవాన్ కూడా అంచనాలు రెట్టింపు చేస్తోంది.

ఇప్పటికే జవాన్ నుండి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ అంతా.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూ వచ్చాయి. తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాని.. షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అయితే.. రిలీజ్ ముందే ట్రైలర్ తో డిఫరెంట్ లుక్స్, సర్ప్రైజ్ లను చూపించిన షారుఖ్.. సినిమాలో ఇంకా చాలా స్టఫ్ ఉందని అనిపించేలా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాడు. వెరసి.. ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా పెరిగిపోయాయని టాక్ నడుస్తోంది. షారుఖ్ సరసన ఈ సినిమాలో నయనతార నటించింది. విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాలలో పఠాన్ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూల్ చేసిన విషయం విదితమే. అప్పుడు అది పూర్తిగా బాలీవుడ్ ట్రీట్మెంట్ తో రూపొందిన సినిమా. కానీ.. ఇప్పుడు జవాన్ అలా కాదు. పక్కా సౌత్ ఫ్లేవర్ తో.. రూపొందినట్లు విజువల్స్ చూస్తే అర్ధమవుతుంది. షారుఖ్ నుండి మాసివ్ యాక్షన్ ని ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. ఈ క్రమంలో తాజాగా జవాన్ థియేట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాలలో భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సుమారు రూ. 23 కోట్లకు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ లెక్కన డీల్ అయితే భారీగా సెట్ అయ్యింది. దాదాపు రూ. 45 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుంది. మరి జవాన్ మూవీ అంతటి టార్గెట్ రీచ్ అవుతుందా లేదా కామెంట్స్ లో తెలపండి.