iDreamPost
android-app
ios-app

ఖరీదైన ప్లాట్ కొన్న బాలీవుడ్ స్టార్ హీరో తనయుడు! ఎన్నికోట్లంటే..

  • Published Jul 29, 2024 | 6:15 PM Updated Updated Jul 29, 2024 | 6:15 PM

Shah Rukh Khan: ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు ఖరీదైన కార్లు, ప్లాట్ల ను కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు కూడా కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ వివరాలు...

Shah Rukh Khan: ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు ఖరీదైన కార్లు, ప్లాట్ల ను కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు కూడా కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ వివరాలు...

  • Published Jul 29, 2024 | 6:15 PMUpdated Jul 29, 2024 | 6:15 PM
ఖరీదైన ప్లాట్ కొన్న బాలీవుడ్ స్టార్ హీరో తనయుడు! ఎన్నికోట్లంటే..

సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో వారు వినియోగించే..ఖరీదైన వాహనాలు, వస్తువులు వంటి వాటి గురించి తెలుసుకునేందుకు  జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో పలువురు సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత విషయాలను, వారు కొనుగోలు చేసిన వస్తువులు, ఇతర ఖరీదైన ఇళ్లు వంటి వాటి విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరి సెలబ్రిటీలకు ఖరీదైన ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరో తనయుడు కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశారు. మరి..ఈ పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాన్ త్రయంలో ఒకడిగా షారూఖ్ ఉన్నారు. ఇక ఆయనకు ఆర్యన్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసింది. ప్రస్తుతం అతడు  సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉంటే.. ఓ నివేదిక ప్రకారం.. ఆర్యన్  కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటితో తన తండ్రికి ఉన్న అనుబంధం కారణంగా ఆ  ఇంటిని కోట్ల పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఢిల్లీలో తన బంధాన్ని బలేపేతం చేసుకునే పనిలో భాగంగా ఆర్యన్ ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఢిల్లీలో తన తండ్రి షారూఖ్ ఖాన్, తల్లి గౌరీ ఖాన్ ఒకప్పుడు దక్షిణ ఢిల్లీలోని ఓ భవనంలో ఉండే వారు. పంచ శీల్ పార్క్ ప్రాంతంలోని ఈ భవనం ఉంది. అయితే తన తండ్రి, తల్లితో అనుబంధం ఉన్న ఆ ఇంటిని ఆర్యన్ కొనుగోలు చేశాడు. రెండతస్తులు ఉండే ఈ భవనాన్ని రూ.37 కోట్ల కొనుగోలు చేశాడు. మే 2024లో రిజిస్టర్ చేయబడిన లావాదేవీలో ఆర్యన్ రూ. 2.64 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించాడు. సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో షారూఖ్ ఖాన్, గౌరి..తమ సంసారా జీవితాన్ని అక్కడే ప్రారభించారు.

ఆ ఇంటితో వారికి ఎంతో భావోద్వేగంతో కూడి ఉంటుంది. అందుకే ఆ ఇంటిని ఆర్యఖాన్ కొనుగోలు చేశాడు. ఢిల్లీలో బాలీవుడ్ తారలు ఏవైనా లావాదేవీలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో అమితాబ్ బచ్చన్ దక్షిణ ఢిల్లీలోని తన గుల్మోహర్ పార్క్ ఆస్తిని కూడా సుమారు రూ. 23 కోట్లకు విక్రయించారని బోటిక్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ వెల్త్‌వైసరీ క్యాపిటల్ వ్యవస్థాపకుడు ప్రదీప్ ప్రజాపతి అన్నారు. మొత్తంగా షారూఖ్ పిల్లలు సుహానా ఖాన్, ఆర్యన్ లు ఇటీవలే రియల్ ఎస్టేట్ లో పెట్టుబుడులు పెట్టడం అందరిలో ఆసక్తికరంగా ఉంది. గతేడాది సుహానా మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom