iDreamPost
android-app
ios-app

అనిరుధ్ పై షారుఖ్ కామెంట్స్! బాలీవుడ్ లో లైఫ్ ఇస్తాయా..?

  • Author ajaykrishna Published - 01:16 PM, Thu - 31 August 23
  • Author ajaykrishna Published - 01:16 PM, Thu - 31 August 23
అనిరుధ్ పై షారుఖ్ కామెంట్స్! బాలీవుడ్ లో లైఫ్ ఇస్తాయా..?

ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కొక్కరి టైమ్ నడుస్తుంది. ఈ విషయం ఎవరు నమ్మకపోయినా.. అది అలాగే జరుగుతుంటుంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో ఇది రెగ్యులర్ గా చూస్తుంటాం. కొన్నేళ్లు ఓ మ్యూజిక్ డైరెక్టర్ కి బాగా కనెక్ట్ అయిన జనాలు.. ఆ తర్వాత వేరే మ్యూజిక్ డైరెక్టర్ కి కనెక్ట్ అవుతుంటారు. అలాగే కొన్నాళ్ళకు ఇంకొకరికి. ఇదంతా వారి మ్యూజిక్ మీద ఇంటరెస్ట్ పోవడం వల్ల కాదు. కొత్తదనం కోరుకునే ప్రాసెస్ లో రెగ్యులర్ మ్యూజిక్ కాకుండా కొత్త రకం ట్యూన్స్ కి కనెక్ట్ అవ్వడంతో ఇలా జరుగుతుంది. ఒకసారి కనెక్ట్ అయ్యాక.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి ట్యూన్స్ కొట్టినా.. తెగ ఎంజాయ్ చేసేస్తుంటారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ హవా నడుస్తుంది. ఓవైపు తమిళ, తెలుగు భాషలతో పాటు మలయాళం, హిందీ భాషలలో కూడా అదిరిపోయే ట్యూన్స్ తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంటున్నాడు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కైనా.. ఇండస్ట్రీలోకి వచ్చాక.. కొంతమంది సూపర్ స్టార్స్ సినిమాలకు మ్యూజిక్ అందించాలని చాలామంది అవకాశాల కోసం తాపత్రయ పడుతుంటారు. అందరికి అవకాశం రాకపోయినా.. కొందరిని మాత్రం ఆ అదృష్టం వరిస్తుంది. అలా ప్రెజెంట్ అనిరుధ్.. అటు తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్ సినిమాలకు వర్క్ చేస్తూనే.. ఇటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీకి వర్క్ చేశాడు.

బాలీవుడ్ లో సౌత్ మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు రేర్ గా వినిపిస్తుంటాయి. అలాంటిది బాలీవుడ్ వాళ్లే సౌత్ మ్యూజిక్ కి కనెక్ట్ అయి.. ఎప్పుడెప్పుడు సౌత్ మ్యూజిక్ తమ సినిమాలలో వినిపిస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే.. డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో షారుఖ్ తో జవాన్ అవకాశం దొరికేసరికి.. అనిరుధ్ అదిరిపోయే సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేశాడట. దీంతో తాజాగా ఔట్ ఫుట్ చూసిన కింగ్ షారుఖ్.. జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిరుధ్ పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. “అనిరుధ్ తనకు కొడుకు లాంటివాడని.. ఇకముందు ఖచ్చితంగా అతన్ని మిస్ అవుతానని” షారుఖ్ అన్నాడు. అంటే.. అనిరుధ్ ని షారుఖ్ ఎంతగా ఓన్ చేసుకున్నాడో అర్ధమవుతుంది. మిస్ అవుతాను అన్నాడంటే పక్కాగా ఫ్యూచర్ లో చాలా ప్రాజెక్ట్స్ ని వీరి కాంబోలో ఎక్స్ పెక్ట్ చేయవచ్చు అని నెటిజన్స్ అంటున్నారు. మరోవైపు అనిరుధ్ షారుఖ్ మాటలను రాసి పెట్టుకో.. బాలీవుడ్ నీకు ఘనస్వాగతం పలకబోతుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ లెక్కన షారుఖ్ బ్లెసింగ్స్ అనిరుధ్ కి బాలీవుడ్ లో లైఫ్ ఇస్తాయేమో చూడాలి. మరి జవాన్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomCasibomcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/