iDreamPost
android-app
ios-app

షారుఖ్ నయా రికార్డు! ఇప్పట్లో ఏ హీరో బ్రేక్ చేయలేడేమో!

  • Author ajaykrishna Updated - 01:21 PM, Tue - 26 September 23
  • Author ajaykrishna Updated - 01:21 PM, Tue - 26 September 23
షారుఖ్ నయా రికార్డు! ఇప్పట్లో ఏ హీరో బ్రేక్ చేయలేడేమో!

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏ హీరో ఏయే రికార్డులు తిరగరాస్తాడని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఏ హీరో ఎలాంటి రికార్డులు కొట్టినా.. సంతోషమే అంటుంటారు ప్రేక్షకులు. అయితే.. రికార్డులు అనేవి పాన్ ఇండియా రేంజ్ హీరోలు ఎవరైనా.. కంటెంట్ ఉన్న సినిమాతో వచ్చి కొట్టేయొచ్చు. కానీ.. తమ రికార్డులను తామే బీట్ చేసి.. కొత్త రికార్డులు క్రియేట్ చేయడమే అసలు విశేషం. పైగా తమ రికార్డులు తామే బ్రేక్ చేయడం మాత్రమే కాకుండా.. మరే హీరో అందుకోలేని విధంగా ఇండస్ట్రీ రికార్డులు సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో కింగ్ షారుఖ్ ఖాన్ తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇప్పటికి రెండు బ్లాక్ బస్టర్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చాడు.

ఈ   ఏడాదిని పఠాన్ సినిమాతో ప్రారంభించిన షారుఖ్.. అదే సినిమాతో కెరీర్ లో ఫస్ట్ టైమ్ రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. దాదాపు ఎనిమిదేళ్లుగా షారుఖ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఈ రికార్డు ఎంతో ఊరటనిచ్చింది. ఆ తర్వాత రీసెంట్ గా జవాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ లెక్కన.. ఒకే ఏడాది రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టడం అంటే.. అదికూడా రూ. 1000 కోట్ల కలెక్షన్స్ తో అంటే.. నయా రికార్డు సృష్టించినట్లే. ప్రస్తుతం కింగ్ షారుఖ్ పేరిట ఒకే ఏడాది రెండు వేల కోట్ల కలెక్షన్స్ రికార్డు నమోదయింది.

కట్ చేస్తే.. ఇప్పుడు షారుఖ్ ఒకే ఏడాది రెండు సినిమాలతో.. రెండు వేలకు పైగా వసూళ్లు రాబట్టిన రికార్డును వేరే ఏ హీరోలు సాధించే విధంగా కనిపించడం లేదని టాక్ నడుస్తుంది. ఎందుకంటే.. పాన్ ఇండియా హీరోలు ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా ఉంది. అలాంటిది ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేసి.. రెండు వేలకోట్లు కలెక్షన్స్ రాబట్టి.. ఇప్పుడు మూడో సినిమాని కూడా సిద్ధం చేస్తున్నాడు షారుఖ్. ఈ రికార్డును అందుకోవడం ఎవరి వల్ల అవుతుంది? ఇంకా మూడో సినిమా డుంకి వస్తే.. ఆ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినా ఈ ఏడాది ఖాతాలోనే పడుతుంది. పైగా లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని.. డుంకి మూవీ తెరకెక్కిస్తున్నారు. సో.. ఆ సినిమాపై అంచనాలు పీక్స్ లోనే ఉన్నాయి. మరి షారుఖ్ రికార్డును కొల్లగొట్టే హీరో ఎవరైనా ఉన్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet