iDreamPost
android-app
ios-app

అతడో శాడిస్ట్, మృగం.. అల్లుడిపై ఐశ్వర్య తల్లి సెన్సేషనల్ కామెంట్స్

  • Published Mar 13, 2024 | 1:48 PM Updated Updated Mar 13, 2024 | 1:48 PM

సీరియల్ నటి ఐశ్వర్య అడ్డాలపై భర్త శ్యామ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అతడి వ్యాఖ్యలు నిరాధారమని ఐశ్వర్య కూడా సమాధానం చెప్పింది. అయితే అతడు అల్లుడు ఎలాంటి వాడో వెల్లడించింది ఆమె తల్లి.

సీరియల్ నటి ఐశ్వర్య అడ్డాలపై భర్త శ్యామ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అతడి వ్యాఖ్యలు నిరాధారమని ఐశ్వర్య కూడా సమాధానం చెప్పింది. అయితే అతడు అల్లుడు ఎలాంటి వాడో వెల్లడించింది ఆమె తల్లి.

  • Published Mar 13, 2024 | 1:48 PMUpdated Mar 13, 2024 | 1:48 PM
అతడో శాడిస్ట్, మృగం.. అల్లుడిపై ఐశ్వర్య తల్లి సెన్సేషనల్  కామెంట్స్

టీవీ, సినీ నటి ఐశ్వర్య అడ్డాల- పిన్నింటి శ్యామ్ కుమార్ కాపురం రోడ్డుకెక్కింది. తనను పెళ్లి పేరుతో మోసం చేసిందంటూ.. ఐశ్వర్యకు చెడు అలవాట్లు ఉన్నాయని, గతంలోనే ఆమెకు పెళ్లైందని, మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని, రూ. 25 లక్షలు దోచేసిందంటూ శ్యామ్ కుమార్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది. రియల్టర్ కరణం రమేష్..అనే వ్యక్తి తనను బెదిరించాడని శ్యామ్ కుమార్ పలు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపాడు. అలాగే పలు ఆడియో రికార్డులను కూడా రిలీజ్ చేశాడు. అలాగే ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా ఆమెకే వంత పాడుతున్నారంటూ పేర్కొన్నాడు. దీంతో ఐశ్వర్య కూడా తన వర్షన్ వినిపించింది. పెళ్లైన 16 రోజుల నుండే తనను హింసించడం మొదలు పెట్టాడని, అతడు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమంటూ కొట్టిపారేసింది.

కాగా, ఈ ఘటనపై ఐశ్వర్య తల్లిదండ్రులు స్పందించారు. గతంలో ఆమెకు పెళ్లైందని, ఆ విషయం దాచి తనతో వివాహం చేశారన్న శ్యామ్ వ్యాఖ్యలపై నటి తల్లి మాట్లాడుతూ..‘ నా కూతురికి తొలి పెళ్లి అతడు చేశాడా.. అతడి తల్లిదండ్రులు చేశారా..? ఎప్పుడైంది. ఎలా అయ్యింది. ఆ ఫ్రూవ్స్ పట్టుకు రమ్మనండి. రెండో పెళ్లి ఇతను ఎలా చేసుకున్నాడు. ముందు పెళ్లి విషయంలో మాకు క్లారిటీ కావాలి. పెళ్లైన ఐదు రోజులకే అతడి క్యారెక్టర్ బయటపడింది. నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే.. నువ్వు ఒక సెలబ్రిటీవి అని. మన సెలూన్‌ను స్పా చేస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తే.. నువ్వు సెలబ్రిటీవి కాబట్టి .. స్పాకు వీఐపీలు వస్తారు. మన బిజినెస్ డెవలప్ అవుతుంది అని నా కూతురితో మాట్లాడాడు’ అంటూ పేర్కొంది తల్లి.

‘ భార్యను పెట్టుకుని బిజినెస్ చేయడం ఏంటీ.. నీకు కాళ్లు, చేతులు లేవా.. అల్రెడీ బిజినెస్ చేస్తున్నావ్ కదా.. జాబ్ ఉంది కదా అది చేసుకోండి. నా క్యారెక్టర్ అదే అయితే.. 8 సంవత్సరాల నుండి హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేకుండా ఉండను కదా.. నేను ఈ ప్రొఫెషనల్‌ను ఫ్యాషన్‌గా ఎంచుకున్నా. నేను సెట్ లోకి వెళ్లానా, నా క్యారెక్టర్ ఏదైతే ఉందో.. అది చేసుకుని వచ్చానా అని మాత్రమే చూస్తా.. చెత్త బిజినెస్ చేసే చెత్త మైండ్ నాది కాదూ.. అని నా కూతురు సమాధానం ఇచ్చింది. దీంతో శ్యామ్ ప్లేట్ ఫిరాయించాడు’ అని తెలిపింది. ఈ సందర్భంగా ఐశ్వర్య, అత్తకి క్షమాపణలు చెబుతూ.. ఓ మేసేజ్ చేయగా.. దాని గురించి వివరించింది ఐశ్వర్య తల్లి.

‘ నా కూతురిని ఓ అసభ్యకరమైన ప్లేసులో చూశాను. తట్టుకోలేక చచ్చి బతికి వచ్చానంటూ కథలు చెబుతున్నాడు కదా.. ఆ తర్వాత నాకు చేసిన మెసేజ్ ఇది. నా కూతురు తప్పు చేసి ఉంటే.. నన్ను తిట్టాలి కానీ.. క్షమించమని ఎవ్వరూ మేసేజ్ చేయరు కదా. హైదరాబాద్ అతడు వెళ్లింది.. వచ్చింది ప్రతిదీ మా దగ్గర ఫ్రూవ్స్ ఉన్నాయి. అతడో శాడిస్టు. అతడికి అనుమానం. ఒక్క మాటలో చెప్పాలంటే సొంత తమ్ముడినే అనుమానించే మృగం వాడు.. ఇలాంటి క్యారెక్టర్ పెట్టుకుని.. ఏ ఆడపిల్లను కాపురానికి పంపిస్తాం. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి .. అది చంపేసుకుని అతడి దగ్గరకు ఎలా వెళుతుంది అలాంటి అలగేషన్స్ వేశాక. పెళ్లైన 18 రోజులు తర్వాత ఏం చూశావ్.. ఇప్పుడు మా అమ్మాయి గురించి ఎంక్వైరీ ఏంటీ’ అంటూ ప్రశ్నించింది ఆవిడ.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom