Venkateswarlu
Venkateswarlu
సీనియర్ తెలుగు నటి జయలలిత అలియాస్ బోరింగ్ పాప గురించి తెలియని వాళ్లు ఉండరు. అసలు పేరుతో కంటే చేపల పులుసు అనే సినిమా పేరుతోనే ఆమె ఎక్కువ పాపులర్ అయ్యారు. దాదాపు 30 సంవత్సరాల సినిమా ప్రస్థానంలో వందల కొద్ది సినిమాల్లో నటించారు. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, కన్నడ, మలయాళంలో కూడా ఆమె సినిమాలు చేశారు. ఈ 30 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. అంతేకాదు! ఓ సారి అత్యాచారానికి కూడా గురయ్యారు.
ఈ విషయాన్నే ఆమె స్వయంగా వెల్లడించారు. ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఈ విషయం ఇంత వరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ రేపటి సీన్ ఏంటో చెబుతాను రూముకు రమ్మన్నాడు. నేను రూముకు వెళ్లగానే గడియ పెట్టి రేప్ చేశాడు. నేను మహిళను. బయటకు పోలేకపోయాను. లాక్ వేసి రేప్ చేశాడు. ఇదో చేదు అనుభవం. అయితే, ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చనిపోయాడు. అది కూడా నన్ను రేప్ చేసిన ఆరు నెలల్లోనే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చనిపోయాడు.
అది మలయాళంలో మొదటి సినిమా. నమ్మి అతడి దగ్గరకు వెళ్లాను. డైలాగ్స్ తెలియవని నమ్మి వెళ్లాను. రూము నుంచి బయట పడదామని చాలా ప్రయత్నించాను. కానీ, నా వల్ల కాలేదు. రేప్ చేశాడు. మనుషుల్ని నమ్మితే ఇలా ఉంటుందా? అనుకున్నా. ఇదో చేదు అనుభవం’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు కూడా ఆమెకు అండగా నిలుస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల పట్ల తప్పుగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, సీనియర్ నటి జయలలితకు ఎదురైన ఈ చేదు అనుభవం పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.