iDreamPost
android-app
ios-app

లీడర్ మూవీలో హీరోయిన్‌కు సైట్ కొడుతున్న ఈ కుర్రాడు.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు

  • Published Jul 25, 2024 | 5:13 PM Updated Updated Jul 25, 2024 | 5:13 PM

తెలుగులో టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఒకరు శేఖర్ కమ్ముల. ఆయన తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా లీడర్. రానా, రిచా, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లు. ఈ పిక్ అందులోనిదే. ఇక్కడ ఇద్దరు కుర్రాళ్లు కనిపిస్తున్నారు కదా.. అందులో కళ్ల జోడు పెట్టుకుని నటికి సైట్ కొడుతున్న ఈ యువకుడు ఓ సెలబ్రిటీ.. ఎవరో చెప్పుకోండి చూద్దాం.

తెలుగులో టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఒకరు శేఖర్ కమ్ముల. ఆయన తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా లీడర్. రానా, రిచా, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లు. ఈ పిక్ అందులోనిదే. ఇక్కడ ఇద్దరు కుర్రాళ్లు కనిపిస్తున్నారు కదా.. అందులో కళ్ల జోడు పెట్టుకుని నటికి సైట్ కొడుతున్న ఈ యువకుడు ఓ సెలబ్రిటీ.. ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Jul 25, 2024 | 5:13 PMUpdated Jul 25, 2024 | 5:13 PM
లీడర్ మూవీలో హీరోయిన్‌కు సైట్ కొడుతున్న ఈ కుర్రాడు.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు

ఒక్కో తరంలో ఒక్కో దర్శకుడు సినిమా తీసే కోణాన్ని మార్చేస్తుంటాడు. మూస ధోరణికి చెక్ పెట్టి.. సరికొత్త ఒరవడిని సృష్టిస్తుంటాడు. తొలుత ఆ వర్సటాలిటీని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయినా.. తన పాథ్ మాత్రం వదిలిపెట్టడు డైరెక్టర్. ఎప్పుడు కొత్త ధనం కోరుకునే సినిమా పిచ్చోళ్లకు ఆ మూవీలు నచ్చుతుంటాయి. ఒకే ధోరణిలో కొట్టుకుపోతున్న తెలుగు ఇండస్ట్రీ దశను మార్చిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. శివ మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మరో దర్శకుడు శేఖర్ కమ్ముల. డాలర్స్ డ్రీమ్ అనే మూవీ తీస్తే ఎవ్వరికీ ఎక్కల.. ఆ తర్వాత వచ్చిన ఆనంద్, గోదావరి, హ్యపీడేస్ మన ఇంట్లో, మన చుట్టూ పాత్రలు మన కళ్ల ముందు కదులుతుంటాయి. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్. ఆయన నుండి వచ్చిన పొలిటికల్ మూవీ లీడర్.

దగ్గుబాటి వారసుడు రానా హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తెరకెక్కిన మూవీ లీడర్. 2010లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. రానా ఎంట్రీకి సరైన మూవీగా నిలిచింది. ఇందులో రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ హీరోయిన్లు. ఇదిగో ఈ సీన్ కనిపిస్తుంది కదా.. ఇది ఈ సినిమాలోనిది. ఇందులో రానా, రిచా బండిపై వెళుతుంటే ఇద్దరు కుర్రాళ్లు సైట్ కొడుతుంటారు. అంతలో రానా హెల్మెట్ తీయగానే వెళ్లిపోతారు. ఆ ఇద్దరు కుర్రాళ్లలో ఒకరు ఎవరో తెలుసా.. ప్రముఖ సెలబ్రిటీ. లైట్ బ్లూ టీ షర్ట్ అండ్ కళ్లజోడు పెట్టుకుని, గుబురు గడ్డం పెంచుకున్న ఇతడు ఎవరో తెలుసా..? ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అయ్యాడు. ఒక్క మూవీతో బాక్సాఫీసును షేక్ చేసేశాడు. ఆ యంగ్ బాయ్ ఎవరంటే.. కల్కి 2898ఏడీతో సంచలనంగా మారిన దర్శకుడు నాగ్ అశ్విన్.

శేఖర్ కమ్ముల శిష్యుల్లో ఒకరు నాగీ. దర్శకుడిగా మారక ముందు నేను మీకు తెలుసా..? లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రమణ్యం మూవీతో దర్శకుడిగా మారిన.. తొలి సినిమాతో వర్సటాలిటీ ఏంటో చూపించాడు. ఈ సారి ఏకంగా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. అలాగే కరోనా సమయంలో వచ్చిన ఆంధాలజీ మూవీ పిట్టకథల్లో ఓ సెగ్మెంట్‌కు డైరక్షన్ చేశాడు. మామ అశ్వినీదత్ బాటలో నిర్మాతగా మారి తన దర్శకుడు జాతి రత్నాలు అనే మూవీని నిర్మించాడు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ లాంటి బిగ్ స్టార్స్ ను ఓకే వేదిక మీదకు తెచ్చి కల్కి వంటి బిగ్ మూవీ చేసి బాక్సాఫీసుకు కలెక్షన్స్ అంటే ఇవి అని చూపించాడు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetlike girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş