iDreamPost
android-app
ios-app

సీతారామరాజు మూవీలో రవితేజ లవర్ గా చేసిన మాన్య గుర్తుందా? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే?

హరికృష్ణ- నాగార్జున మల్టీ స్టారర్లుగా నటించిన చిత్రం సీతారామ రాజు. ఇందులో రవితేజ, బ్రహ్మాజీ వంటి స్టార్స్ నటించారు. ఇందులో నాగ్, హరికృష్ణ చెల్లెలిగా నటించిన యాక్ట్రెస్.. ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందో తెలుసా..?

హరికృష్ణ- నాగార్జున మల్టీ స్టారర్లుగా నటించిన చిత్రం సీతారామ రాజు. ఇందులో రవితేజ, బ్రహ్మాజీ వంటి స్టార్స్ నటించారు. ఇందులో నాగ్, హరికృష్ణ చెల్లెలిగా నటించిన యాక్ట్రెస్.. ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందో తెలుసా..?

సీతారామరాజు మూవీలో రవితేజ లవర్ గా చేసిన మాన్య గుర్తుందా? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే?

తెలుగులో ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ..చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలయ్య నటించిన 80-90వ దశకంలో మల్టీ స్టారర్ మూవీలు చాలా అరుదుగా వచ్చాయి. వాటిల్లో ఒకటి సీతారామరాజు. ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఏఎన్నార్ ఫ్యామిలీకి చెందిన ఇద్దరు నటుల్ని కలిపిన ఘనత దర్శకుడు వైవీఎస్ చౌదరికే దక్కుతుంది. 1999లో ఫిబ్రవరిలో రిలీజైన మూవీ ఓకే అనిపించుకుంది. అక్కినేని వారసుడు నాగార్జున, నందమూరి వారసుడు హరికృష్ణ హీరోలుగా నటించారు. సాక్షి శివానంద్, సంఘవి, రవితేజ, శివాజీ, మాన్య, చంద్రమోహన్, కోటా శ్రీనివాసరావు, బెనర్జీ, బ్రహ్మాజీ, సత్య ప్రకాష్, నిర్మలమ్మ, అహుతి ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. అప్పటి వరకు అమ్మమ్మగా అలరించిన నిర్మలమ్మ.. ఇందులో నెగిటివ్ రోల్‌లో కనిపిస్తుంది. గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్, కామాక్షి మూవీస్ బ్యానర్లపై ఈ మూవీ తెరకెక్కగా.. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. సీతారామ రాజు అనగానే.. ముందుగా గుర్తుకు వచ్చే సాంగ్ ‘శ్రీవారు దొరగారు.. ఆయ్.. ఏంటండీ మీ పేరు’ సాంగే. ఇప్పటికీ టీవీల్లో వస్తుంటే.. ట్యూన్‌కు కళ్లప్పగించి చూడటమే కాదు హమ్ చేస్తుంటారు. సిగరెట్ సాంగ్ ఎంతో ఫేమస్ అయ్యింది. ఇంకో రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో మాస్ మహారాజ్ రవితేజ కూడా సైడ్ క్యారెక్టర్‌లో నటించిన సంగతి విదితమే. రవితేజను ప్రేమిస్తుంది నాగార్జున, హరికృష్ణ ముద్దుల చెల్లెలు సుమ.

ఆ పాత్రలో నటించిన యాక్టర్ గుర్తుందా.. చక్కని నవ్వుతో, గుండ్రటి కళ్లతో నటించిన బ్యూటీ పేరు మాన్య. ఆమె తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. కానీ ఇంగ్లాండ్‌లో కొంత కాలం ఉండి.. ఆ తర్వాత ఇండియాకు వచ్చింది. చైల్ట్ ఆర్టిస్టుగా అలరించిన మాన్య. ఆ తర్వాత సహాయ నటిగా, హీరోయిన్ అయ్యింది. సీతారామరాజుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాన్య. దేవా, సాహసబాలుడు-విచిత్ర కోతి, బ్యాచులర్స్, సాంబయ్య, కాలేజీ, లవ్, శివన్న, గణపతి, ప్రేమకు స్వాగతం, బ్రహ్మచారులు, తమాషా, ఎంతవారులైన వంటి చిత్రాలు చేసింది. ఆమెకు కన్నడ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది. దర్శన్ శాస్త్రి మూవీతో ఒక్కసారిగా క్లిక్ అయ్యింది. కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది.

2007లో తెలుగు ఇండస్ట్రీకి దూరమైన ఆమె.. 2010లో పూర్తిగా సినిమాల నుండి తప్పుకుంది. 2008లో సత్యపాల్‌ను వివాహం చేసుకున్న ఆమె.. డివోర్స్ ఇచ్చి.. 2013లో వికాస్ బాజ్ పేయిని వివాహం చేసుకుంది. 40కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె న్యూయార్క్‌లోని క్రెడిట్ సూయిస్‌లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తుంది. ప్రస్తుతం సిటీ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తుంది. అయితే ఈ మధ్య ఆమె పక్షవాతానికి గురైందంటూ వార్తలు రాగా, క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని తన తల్లి కోసం కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Manya (@manya_naidu)