iDreamPost
android-app
ios-app

ఆ దర్శకుడు నన్ను వాడుకున్నాడు.. 7 సార్లు అబార్షన్ అయింది: నటి

  • Author singhj Published - 05:00 PM, Tue - 12 September 23
  • Author singhj Published - 05:00 PM, Tue - 12 September 23
ఆ దర్శకుడు నన్ను వాడుకున్నాడు.. 7 సార్లు అబార్షన్ అయింది: నటి

ప్రముఖ నటి విజయలక్ష్మి పేరు వినే ఉంటారు. తెలుగు, కన్నడ భాషల్లో చాలా సినిమాల్లో ఆమె నటించారు. కొన్ని చిత్రాల్లో హీరోయిన్​గానూ యాక్ట్ చేశారు. అయితే ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా మారి ఎన్నో మూవీస్​లో తన నటనా పటిమతో ప్రేక్షకులను అలరించారు. 1997లో ‘నాగమండలం’ అనే సినిమాతో ఆమె తన సినీ కెరీర్​ను ప్రారంభించారు. ఈ ఫిల్మ్​లో విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​కు జోడీగా నటించారామె. ఫస్ట్ మూవీతోనే ఫిల్మ్​ఫేర్ ఉత్తమ నటిగా పురస్కారాన్ని గెలుచుకున్నారు. అనంతరం ‘జోడిహక్కి’, ‘భూమితై చొచ్చల మగా’, ‘అరుణోదయ’, ‘స్వస్తిక్’, ‘హబ్బా’, ‘సూర్యవంశం’ వంటి కన్నడ చిత్రాల్లో నటించారు.

తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి ఇక్కడి ఆడియెన్స్​నూ ఆకట్టుకున్నారు విజయలక్ష్మి. బ్లాక్​ బస్టర్​గా నిలిచిన ‘హనుమాన్ జంక్షన్​’తో పాటు ‘పృథ్వీ నారాయణ’ మూవీలో ఆమె కనిపించారు. అంతేగాకుండా స్టార్ హీరో మోహన్​లాల్​తో కలసి ‘దేవదూతన్’ అనే మలయాళ చిత్రంలోనూ నటించారు. ఆమె తన కెరీర్​లో దాదాపుగా 40 సినిమాలు చేశారు. అయితే 2006లో తండ్రి మరణంతో విజయలక్ష్మి నిద్రమాత్రలు వేసుకొని సూసైడ్​కు పాల్పడినట్లు అప్పట్లో న్యూస్ వచ్చింది. మూడేళ్ల డేటింగ్ తర్వాత మార్చి 2007లో నటుడు సృజన్ లోకేష్​తో ఎంగేజ్​మెంట్ చేసుకున్నారు.

నటుడు సృజన్​తో విజయలక్ష్మి నిశ్చితార్థం పెళ్లి వరకూ వెళ్లలేదు. అనంతరం సినిమాలకే పరిమితమైన విజయలక్ష్మి గత కొన్నేళ్లుగా మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత సీమాన్​పై ఆ మధ్య తీవ్ర ఆరోపణలు చేశారు విజయలక్ష్మి. ఆయన తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడని ఆరోపిస్తూ 2020 ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆయన వేధింపులు తట్టుకోలేక మాత్రలు మింగి సూసైడ్​కు ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్​గా మరోమారు సీమాన్​పై ఆరోపణలు చేశారామె.

సీమాన్ మ్యారేజ్ పేరుతో నమ్మించి తనను శారీరకంగా వాడుకున్నాడని విజయలక్ష్మి ఆరోపించారు. లవ్ చేస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని వాపోయారు. తన బంగారు నగలు తీసుకొని సీమాన్ మోసం చేశాడని తెలిపారు. విజయలక్ష్మి ఆరోపణలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీమాన్​ను ఇన్వెస్టిగేషన్​కు హాజరవ్వాలని ఆదేశించారు. అయితే ఆయన విచారణకు రాలేదు. దీంతో ఇన్వెస్టిగేషన్​కు రావాల్సిందేనని మరోమారు హెచ్చరించారు. దీంతో ఇన్వెస్టిగేషన్​కు వచ్చిన సీమాన్​ను విచారించారు పోలీసులు. అలాగే అబార్షన్ ఆరోపణల నేపథ్యంలో విజయలక్ష్మికి మెడికల్ టెస్టులు నిర్వహించారు.

ఇదీ చదవండి: స్టార్ హీరో మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం!