iDreamPost
android-app
ios-app

క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి..ఇప్పుడు టాప్ హీరోయిన్! గుర్తుపట్టలేరు!

  • Published May 02, 2024 | 5:59 PM Updated Updated May 02, 2024 | 5:59 PM

క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి..ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఈ ఏడాది రెండు హిట్లతో దూసుకెళుతోంది. ఆమె మల్టీటాలెంటర్. కేవలం నటి మాత్రమే కాదు.. మోడల్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, సింగర్ కూడా. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.

క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి..ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఈ ఏడాది రెండు హిట్లతో దూసుకెళుతోంది. ఆమె మల్టీటాలెంటర్. కేవలం నటి మాత్రమే కాదు.. మోడల్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, సింగర్ కూడా. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.

  • Published May 02, 2024 | 5:59 PMUpdated May 02, 2024 | 5:59 PM
క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి..ఇప్పుడు టాప్ హీరోయిన్! గుర్తుపట్టలేరు!

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేని ముద్దుగుమ్మలు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ టాలెంట్ చూపిస్తున్నారు. తల్లిదండ్రులు వారసత్వాన్ని తీసుకోకుండా.. ఫ్యాషన్ అండ్ మోడలింగ్ అండ్ ఎంటర్‌టైన్ మెంట్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. ఇదిగో ఈ ఫోటోలోని చిన్నారి కూడా అదే బాపతు. తండ్రిది హోటల్ వ్యాపారం.. తల్లి ఎయిర్ హోస్టెస్. ఈ రంగంలో ఏ రంగాన్ని ఎంచుకున్న టీటౌన్‌కు మరో అందం మిస్సైది. కానీ పేరెంట్స్ ఏలిన ఇండస్ట్రీలను కాదని, తాను డిఫరెంట్ రంగాన్ని ఎంచుకుని దూసుకెళుతోంది. పుట్టి పెరిగిందంతా ముంబయిలో అయినా.. తెలుగులో వరుస ఛాన్సులు కొల్లగొడుతూ.. హిట్స్ అందుకుంటోంది. గ్లామరస్ పాత్రలతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.

తన చిన్నప్పుటి ఫోటోకు ఇప్పటి ఈ భామకు అస్సలు పోలికలే ఉండవు. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు ఫోజులిస్తున్న ఈ క్యూటీ.. ఇప్పడు గ్లామరస్ క్వీన్. ఈ ఏడాది ఓ వెబ్ సిరీస్, ఓ మూవీతో హిట్స్ అందుకుని మంచి పేరు తెచ్చుకుంది. ఆమె మల్టీ టాలెండ్ కూడా. కేవలం నటి మాత్రమే కాదు.. అంతకు ముందు మోడల్, కొరియోగ్రాఫర్. ఆమె సింగర్ కూడా. రణబీర్ కపూర్ రాక్ స్టార్ మూవీకి అసిస్టెంట్ కొరియోగ్రఫర్‌గా వర్క్ చేసింది. ఆ తర్వాత హిందీ, తెలుగులో ఏక కాలంలో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ పొంది.. ఇక్కడే కొనసాగుతుంది. ఇంతకు ఆ భామ ఎవరంటే.. రింగు రింగుల జుట్టుతో కుర్రాళ్లను మాయలో పడేసుకున్న సీరత్ కపూర్. 2014లో శర్వానంద్, సుజిత్ కాంబోలో వచ్చిన రన్ రాజా రన్ మూవీతో సీరత్ హీరోయిన్‌గా పరిచయమై తొలి సినిమాతోనే హిట్ అందుకుంది.

ఆ తర్వాత వచ్చిన టైగర్, కొలంబస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. నాగార్జున, సమంతల రాజుగారి గది 2 ఓకే అనిపించింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఒక్క క్షణంలో స్వాతి పాత్రలో మెప్పించింది. రవితేజతో టచ్ చేసి చూడులో నటించింది. కృష్ణ అండ్ ఈస్ లీలా మూవీలో నటించింది. మా వింత గాధ వినుమా, హిందీ మారిచ్ మూవీలో యాక్ట్ చేసింది.కానీ ఈ ఏడాది రిలీజైన భామా కలాపం, సేవ్ ది టైగర్స్2 ఆమె కెరీర్‌కు ప్లస్ అయ్యే పాత్రల్లో మెరిసింది. ఈ రెండు మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా సేవ్ ది టైగర్స్ 2లో హంసలేఖ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది అమ్మడు.  తన హాట్ లుక్స్ తో కుర్రకారును గిలిగింతలు పెట్టేస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetloto girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş