iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్! అస్సలు గుర్తుపట్టలేరు!

  • Published Feb 15, 2024 | 5:58 PM Updated Updated Feb 15, 2024 | 5:58 PM

ఈ ఫోటోలోని పాపను చూశారా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లోనే కాదూ.. ఓ ఇంగ్లీష్ మూవీ కూడా చేస్తుంది. ఇంతకు ఆ కథానాయకి ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలోని పాపను చూశారా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లోనే కాదూ.. ఓ ఇంగ్లీష్ మూవీ కూడా చేస్తుంది. ఇంతకు ఆ కథానాయకి ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Feb 15, 2024 | 5:58 PMUpdated Feb 15, 2024 | 5:58 PM
ఈ ఫోటోలో పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్! అస్సలు గుర్తుపట్టలేరు!

గతంలో పోల్చుకుంటే టాలీవుడ్‌లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. బాహుబలికి ముందు తర్వాత అన్నట్లుగా మారిపోయింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు పరిశ్రమ గురించి చర్చించుకునేలా చేసింది. అలాగే కథానాయకుల విషయంలో కూడా ఛెంజేస్ చేసుకుంటున్నాయి. బయట ముద్దుగుమ్మలకు అవకాశాలు కల్పిస్తూనే.. తెలుగు హీరోయిన్లను ప్రోత్సహిస్తున్నారు. ఇంతకు ముందు పరిస్థితులు చూస్తే.. ఇప్పుడు కాస్త బెటర్ అని చెప్పొచ్చు.. స్వాతి రెడ్డి, అంజలి, ఈషా రెబ్బ, రీతు వర్మ లాంటి తెలుగు అమ్మాయిలు కొనసాగుతుండగా.. ఇప్పుడు కొత్త అమ్మాయిలు హవా చాటుతున్నారు. వారిలో ఒకరు ఈ ఫోటోలోని పాప కూడా.

ఈ ఫోటోలో ఉన్న పాపను తీక్షణంగా చూడండి..చిన్నప్పుడే నటన వైభవాన్ని ప్రదర్శిస్తున్నట్లు లేదు. కృష్ణుడో లేక గోపిక వేష ధారణలో ఆకట్టుకుంటున్న ఈ పాప..టాలీవుడ్డే కాదూ బాలీవుడ్‌ను తన అందచందాలతో షేక్ చేసేస్తుంది. పక్కా తెలుగు అమ్మాయి ఐనా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు కాస్త గ్యాప్ తీసుకుంది. అంతేనా.. ఈమె ఏ హీరోతో యాక్ట్ చేసినా, కనిపించినా ఎఫైర్ అంటూ రూమర్స్ వచ్చేస్తుంటాయి. తెలుగు అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ చేయరు అన్నదానికి ఈమె మినహాయింపు. బిగ్ స్క్రీన్ లో కనిపిస్తే బోల్డ్ కన్నివేశాలు చేయాల్సిందే. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. మాజీ మిస్ ఇండియా శోభిత ధూళిపాళ్ల.

ఏపీలో పుట్టిన అమ్మడు.. తండ్రి ఉద్యోగ రీత్యా మారడంతో.. పలు ప్రాంతాలను చుట్టేసింది. కాలేజీ చదువుతున్న రోజుల్లో మిస్ ఇండియా పోటీలకు ఆడిషన్స్ జరుగుతున్నాయని ఫ్రెండ్ చెబితే వెళ్లి.. అనుకోకుండా సెలక్ట్ అయ్యింది. అలా 2013 మిస్ ఇండియాగా నిలిచింది. 2016లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల సుందరి.. రామన్ రాఘవ్, చెఫ్, కళాకండి అనే హిందీ చిత్రాల్లో చేశాక.. తెలుగులో గూడచారి రూపంలో అవకాశం వచ్చింది. మళ్లీ మూడేళ్లు గ్యాప్ తీసుకుని మేజర్ మూవీతో మెస్మరైజ్ చేసింది. రెండు సినిమాలు అడవి శేష్‌తో చేసే సరికి రూమర్లు వచ్చాయి. అలాగే నాగ చైతన్యతో కూడా ఎఫైర్ నడుస్తుందంటూ మీడియా కోడై కూస్తోంది. అయితే వీటన్నింటిని పక్కన పెట్టిన అమ్మడు.. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసుకుంటూ పోతుంది.

మలయాళ, తమిళ ఇండస్ట్రీల్లోకి కూడా అడుగుపెట్టింది. పెన్నియన్ సెల్వం చిత్రంలో ఆమెకు మరింత పేరు వచ్చింది. మేడిన్ హెవెన్, బర్డ్ ఆఫ్ బ్లడ్, ద నైట్ మేనేజర్ వంటి వెబ్ సిరీస్ చేసింది. ద నైట్ మేనేజర్ సిరీస్‌లో అనిల్ కపూర్‌కు జోడి కట్టడమే కాకుండా అందాల ప్రదర్శన చేసింది. అమెరికన్ మ్యాన్  అనే ఇంగ్లీష్ మూవీలో నటిస్తోంది. వీటితో పాటు హిందీలో సితార అనే సినిమా చేస్తోంది. తెలుగులో చేసినవి రెండంటే.. రెండు సినిమాలే కానీ.. ఆమెపై వచ్చిన రూమర్స్ అన్ని ఇన్ని కావు.. మొత్తానికి ఓ తెలుగు అమ్మాయి.. కన్నడ మినహాయించి.. అన్ని ఇండస్ట్రీలను చుట్టేస్తోంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişaresbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom