iDreamPost
iDreamPost
ఓవర్సీస్ లో అదరగొడుతున్న సర్కారు వారి పాట నిన్నటితో రెండు మిలియన్ల మార్కు అందుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఫీట్ సాధ్యం కావడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఈ ఘనత నాలుగోసారి అందుకున్న టాలీవుడ్ హీరోగా మహేష్ బాబు మరోసారి యుఎస్ లో తన మార్కెట్ ఎంత బలంగా ఉందో నిరూపించారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ ల తర్వాత ఆ రేంజ్ లో ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన సినిమా వచ్చి నలభై రోజుల పైనే అయ్యింది. పైగా ఆచార్య డిజాస్టర్ కావడంతో ఎవరూ దాన్ని ఓసారి కూడా చూసిన పాపాన పోలేదు. దీంతో పెద్ద సినిమాల గ్యాప్ ని సర్కారు వారి పాట పూర్తిగా అందుకుంది. ఇంకా ఇది మొదటి వారమే.
ఫైనల్ రన్ కు చాలా టైం ఉంది. 27న ఎఫ్3 వచ్చేదాకా చెప్పుకోదగ్గ పోటీ ఏది లేదు. 20న రిలీజయ్యే శేఖర్, డేగల బాబ్జీలు యుఎస్ లో ప్రభావం చూపించే అవకాశాలు సున్నానే. పైగా రెండు వేర్వేరు భాషల్లో చూసేసిన రీమేకులు. సో మహేష్ ఎక్కడిదాకా వెళ్తాడనేది వేచి చూడాలి. సోషల్ మీడియాతో పాటు రివ్యూస్ లో టాక్ కొంత భిన్నంగా ఉన్నప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ దాకా రప్పించడంలో మహేష్ మరోసారి సక్సెస్ అయ్యాడు. ఇవాళ్టి నుంచి వీక్ డేస్ కాబట్టి డ్రాప్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ స్థాయిలో అనే దాన్ని బట్టి ఫిగర్స్ లో మార్పులు ఉంటాయి. మరీ తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ని ఆడేసుకున్న సర్కారు వారి పాటకు అసలు పరీక్ష నేడు మొదలుకానుంది. తెలంగాణలో ఇంకో మూడు రోజుల పాటు పెంచిన టికెట్ ధరలతోనే అమ్మకాలు చేయాలని నిర్ణయించుకోవడం వసూళ్ల మీద ఎఫెక్ట్ చూపించడం ఖాయం. దానికి తగ్గట్టే అడ్వాన్ బుకింగ్స్ లో తగ్గుదల కనిపిస్తోంది. మరి కౌంటర్ సేల్స్ తో ప్రిన్స్ ఏమైనా మేజిక్ చేస్తారేమో చూడాలి. ఈ రోజు సాయంత్రం కర్నూలులో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. మొదటిసారి అక్కడ అడుగు పెట్టనున్న మహేష్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.