iDreamPost
android-app
ios-app

సరిపోదా శనివారం.. టైటిల్ ఇన్స్పిరేషన్ ఆ మూవీనా?

  • Author ajaykrishna Published - 08:15 AM, Thu - 26 October 23

ఇండస్ట్రీలో టైటిల్స్ దగ్గరనుండి ఆడియన్స్ లో సినిమాలపై ఆసక్తి మొదలవుతుంది. ఒకప్పుడు ఎంత పెద్ద స్టార్స్ అయినా.. టైటిల్స్ అన్ని తెలుగులోనే ఉండేవి. రానురాను టైటిల్స్ లో తెలుగు ప్రాముఖ్యత తగ్గి.. ఇంగ్లీష్ లో టైటిల్స్ పెట్టేస్తున్నారు. సరే.. సబ్జెక్టుని అనుసరించి అలా పెట్టారు అనుకుందాం. కానీ.. పెట్టిన టైటిల్స్ జనాల నోళ్లలో ఎంతవరకు నోటెడ్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో టైటిల్స్ దగ్గరనుండి ఆడియన్స్ లో సినిమాలపై ఆసక్తి మొదలవుతుంది. ఒకప్పుడు ఎంత పెద్ద స్టార్స్ అయినా.. టైటిల్స్ అన్ని తెలుగులోనే ఉండేవి. రానురాను టైటిల్స్ లో తెలుగు ప్రాముఖ్యత తగ్గి.. ఇంగ్లీష్ లో టైటిల్స్ పెట్టేస్తున్నారు. సరే.. సబ్జెక్టుని అనుసరించి అలా పెట్టారు అనుకుందాం. కానీ.. పెట్టిన టైటిల్స్ జనాల నోళ్లలో ఎంతవరకు నోటెడ్ అవుతున్నాయి.

  • Author ajaykrishna Published - 08:15 AM, Thu - 26 October 23
సరిపోదా శనివారం.. టైటిల్ ఇన్స్పిరేషన్ ఆ మూవీనా?

ఇండస్ట్రీలో టైటిల్స్ దగ్గరనుండి ఆడియన్స్ లో సినిమాలపై ఆసక్తి మొదలవుతుంది. ఒకప్పుడు ఎంత పెద్ద స్టార్స్ అయినా.. టైటిల్స్ అన్ని తెలుగులోనే ఉండేవి. రానురాను టైటిల్స్ లో తెలుగు ప్రాముఖ్యత తగ్గి.. ఇంగ్లీష్ లో టైటిల్స్ పెట్టేస్తున్నారు. సరే.. సబ్జెక్టుని అనుసరించి అలా పెట్టారు అనుకుందాం. కానీ.. పెట్టిన టైటిల్స్ జనాల నోళ్లలో ఎంతవరకు నోటెడ్ అవుతున్నాయి. రిలీజ్ టైమ్ కి ఫలానా స్టార్ సినిమా పేరు ఏదో ఉండే ఏమిటది? అని మిడిల్ ఏజ్ దాటిన ప్రేక్షకులు అడిగే పరిస్థితి మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. సినిమా టైటిల్స్.. ఖచ్చితంగా ఆ సినిమాలకు కావాల్సిన బజ్ క్రియేట్ చేయడంలో తోడ్పడతాయి అనేది నిజం.

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా అనౌన్స్ చేసిన కొత్త సినిమా టైటిల్ ఆసక్తి రేపుతోంది. ఏంటి.. ఆ టైటిల్ తో ఏమైనా ప్రాబ్లెమా అనంటే అది కాదు. నాని ప్రెజెంట్ తన 30వ సినిమా ‘హాయ్ నాన్న’ చేస్తూనే.. ఇటీవల 31వ సినిమా అనౌన్స్ చేశాడు. హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. కొత్తగా ప్రకటించిన సినిమా టైటిల్ చర్చనీయంశంగా మారింది. ఆ సినిమా పేరు ‘సరిపోదా శనివారం’. ఏంటి ఇందులో ఇంగ్లీష్ ఏం లేదుగా.. జనాలకు కూడా బాగానే గుర్తుంటుంది కదా అనిపించవచ్చు. ఇక్కడ పాయింట్ టైటిల్ తెలుగు, ఇంగ్లీష్ అని కాదు. ఈ టైటిల్ ఎలా పెట్టారు అని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఆ వివరాల్లోకి వెళ్తే.. అంటే సుందరానికి సినిమా తర్వాత నాని – దర్శకుడు వివేక్ ఆత్రేయ కలిసి చేస్తున్న రెండో సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి మూవీ ఫలితం నిరాశ పరిచినా.. కంటెంట్ మీద నమ్మకంతో వివేక్ కి మరోసారి అవకాశం ఇచ్చాడట నాని. అయితే.. సినిమాకు సరిపోదా శనివారం అనే టైటిల్ పెట్టి.. మాస్ యాక్షన్ మూవీ తీస్తున్నారని టాక్ నడుస్తుంది. దీంతో రెండింటికి సింక్ అవ్వట్లేదని కామెంట్స్ ఓవైపు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మధ్య మేకర్స్ అంతా ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అంటే.. ఫలానా సినిమాలో సాంగ్, టైటిల్, డైలాగ్.. ఇలా ఏది పాపులర్ అయినా దాన్ని వెంటనే టైటిల్ పెట్టేసి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడీ సరిపోదా శనివారం టైటిల్ అలా పెట్టారని కాదు. మంగళవారం అనే మూవీ టైటిల్ చూసి పెట్టారని మాట్లాడుకుంటున్నారు. పాయల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. మరి సరిపోదా శనివారం టైటిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss