iDreamPost
android-app
ios-app

సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ ఇప్పుడు కనిపించకపోవడానికి కారణం? చాలా మందికి తెలియదు

జానీ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ స్టోరీ అందించిన మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. 2016లో వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. బాబీ డైరెక్టర్. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ ను ఢీకొన్న స్టైలిష్ విలన్ గుర్తున్నాడా...? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..? తెలుగు తెరకు కనిపించకపోవడానికి కారణం..?

జానీ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ స్టోరీ అందించిన మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. 2016లో వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. బాబీ డైరెక్టర్. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ ను ఢీకొన్న స్టైలిష్ విలన్ గుర్తున్నాడా...? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..? తెలుగు తెరకు కనిపించకపోవడానికి కారణం..?

సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ ఇప్పుడు కనిపించకపోవడానికి కారణం? చాలా మందికి తెలియదు

యంగ్ డైనమిక్ దర్శకుల్లో ఒకరు కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. పవర్ మూవీతో డైరెక్టరైన కొల్లి బాబీలో ఫైర్ ఉందని గ్రహించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చాడు. ఈ కాంబోలో వచ్చిన మూవీనే సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీకి పవనే కథను అందించడం గమనార్హం. 2016లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్‌గా డిజాస్టర్ అయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అలరించింది. అలాగే టీవీ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. ఏరోస్ ఇంటర్నేషనల్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్‌మెంట్ పతాకాలపై పవన్ కళ్యాణ్, శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. శరద్ ఖేల్కర్, సంజనా గల్రానీ, బ్రహ్మానందం, అలీ, తణికెళ్ల భరణి, ముకేష్ రుషి, రావు రామేష్, ప్రదీప్ రావత్, పోసాని, సుడిగాలి సుధీర్ వంటి స్టార్ కాస్టింగ్ ఉంది.

 సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో లక్ష్మీ రాయ్ స్పెషల్ సాంగ్‌లో అలరించింది. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ‘ఓ పిల్లా శుభానల్లా.. వచ్చావే ఎండల్లో వెన్నెల్లా, నీ చేప కళ్లు, చేప కళ్లు, టైటిల్ సాంగ్, చిన్నదాని చూపులోనా సోకు ఉందిరో, తోబా తోబా తోబా తోబా తోడుగుంది దిల్లు రుబా’ పాటలు ఆకట్టుకున్నాయి. తొలుత ఈ మూవీకి గబ్బర్ సింగ్ 2 అని పెట్టగా.. సంపత్ నంది దర్శకుడిగా మూవీ స్టార్ట్ అయ్యింది. వర్క్ డిఫరెన్స్ వల్ల.. సంపత్ నంది ప్లేసులో రీ ప్లేస్ అయ్యాడు బాబీ. 2016లో బాహుబలి తర్వాత బాహుబలి ది బిగినింగ్ తర్వాత ఎక్కువ థియేటర్లలో రిలీజైన చిత్రంగా నిలిచింది. కానీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమాలో హీరో గ్యాంగే కాదు.. విలన్ గ్యాంగ్ కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఢీ కొట్టే పాత్రలో నటించిన యాక్టర్ గుర్తున్నాడా..? ఈ మూవీలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడు. అతడు ఎవరంటే.. శరద్ ఖేల్కర్. మహారాష్ట్రకు చెందిన శరద్ ఖేల్కర్.. తొలుత బాలీవుడ్ టీవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత మెల్లిగా వెండితెరపై కనిపించాడు. హల్ చల్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన అతడు.. మరాఠీ, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నటించాడు. ఇప్పటి వరకు తెలుగులో చేసిన ఏకైక మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. భైరవ్ సింగ్ పాత్రలో మెప్పించాడు. కానీ ఆ తర్వాత టాలీవుడ్ సినిమాల్లో కనిపించలేదు. కారణం ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్డడంతో పాటు టాలీవుడ్ నుండి ఆఫర్స్ రాకపోవడంతో తెలుగు తెరకు దూరమయ్యాడు.

ఈ ఏడాది తమిళ మూవీ అయలాన్‌తో మరోసారి దక్షిణాది ప్రేక్షకులను పలకరించాడు శరద్. ఎక్కువగా హిందీ, మరాఠీ చిత్రాలపైనే ఫోకస్ చేశాడు. నాచ్ బలియా2లో తనతో పాటు డ్యాన్స్ చేసిన టీవీ నటి కీర్తీ గౌక్వాడ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికో పాప. ప్రస్తుతం అతడు ఎక్కువగా హిందీ చిత్రాల్లోనే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా తెలుగు వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్లా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన శ్రీకాంత్ మూవీలో నటించాడు. ఇందులో డాక్టర్ రవిగా కనిపించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత తెలుగు తెరకు దూరమైన ఈ స్టైలిష్ విలన్.. మళ్లీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో…?

 

View this post on Instagram

 

A post shared by Sharad Kelkar (@sharadkelkar)