iDreamPost
android-app
ios-app

కుమారి ఆంటీ హోటల్లో సందడి చేసిన సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ

  • Published Jan 21, 2024 | 2:45 PM Updated Updated Jan 21, 2024 | 2:45 PM

Ooru Peru Bhairavakona.. ఇటీవల సోషల్ మీడియా ఓపెన్ చేయగానే కనిపిస్తోంది కుమారి ఆంటీ. హైదరాబాద్ వాసులకు ఈమె పక్కాాగా తెలుసు. స్ట్రీట్ ఫుడ్ దేవత ఆవిడ. భోజన ప్రియులు ఆమె చేతి వంట రుచి చూడాల్సిందే మరీ. వంటతోనే కాదూ.. వీడియోలతో కూడా ట్రెండ్ అవతున్నారు.

Ooru Peru Bhairavakona.. ఇటీవల సోషల్ మీడియా ఓపెన్ చేయగానే కనిపిస్తోంది కుమారి ఆంటీ. హైదరాబాద్ వాసులకు ఈమె పక్కాాగా తెలుసు. స్ట్రీట్ ఫుడ్ దేవత ఆవిడ. భోజన ప్రియులు ఆమె చేతి వంట రుచి చూడాల్సిందే మరీ. వంటతోనే కాదూ.. వీడియోలతో కూడా ట్రెండ్ అవతున్నారు.

  • Published Jan 21, 2024 | 2:45 PMUpdated Jan 21, 2024 | 2:45 PM
కుమారి ఆంటీ హోటల్లో సందడి చేసిన సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ

హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్స్ ఎంతో ఫేమస్. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరు ఒక్కసారైనా స్ట్రీట్ ఫుడ్స్..అందులోనూ బిర్యానీ,నాన్ వెజ్ వంటకాలను రుచి చూడకుండా ఉండరు. అలాంటి స్ట్రీట్ ఫుడ్స్‌లో బాగా ప్రాచుర్యం పొందింది కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్.హైదరాబాద్ నగర వాసులకు ఈమె హోటల్ తెలుసు. నాన్ వెజ్ భోజనాన్ని కడుపారా ఆరగించి, ఆస్వాదించాలంటే.. ఇక్కడకు రావాల్సిందే. కేబుల్ బ్రిడ్జి దగ్గరలోని ఐటీసీ కోహినూరు హోటల్ రోడ్డులో ఈ ఫుడ్ పాయింట్ ఉంటుంది. మధ్యాహ్నం అయితే చాలు సాఫ్ట్ వేర్స్‌తో పాటు మిగిలిన వాళ్లంతా అక్కడ వాలిపోతుంటారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారండోయ్. అలాగే ట్రోల్స్ కూడా చేస్తున్నారు పాపం.

మధ్యాహ్నం బాగా ఆకలేసినా, వెజ్, నాన్ వెజ్ మీల్స్ తినాలన్నా బెస్ట్ ఆప్షన్ కుమారి పాయింటే గుర్తుకు వస్తుంది. అంతలా ఆమె తన వంటలతో ఆకట్టుకుంటుంది. కేవలం వంటలే కాదండోయ్..అమ్మ, బుజ్జి చెప్పు.. ఏం కావాలి అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ.. కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది.. ఆమె అసలు పేరు సాయి కుమారి కానీ.. కుమారి ఆంటీ అంటేనే అందరికీ తెలుసు. సుమారు పుష్కర కాలం నుండి ఆమె రోడ్డు పక్కన ఈ వ్యాపారం చేస్తోంది. ఆమె నెలకు రెండున్నర నుండి మూడు లక్షల వరకు సంపాదిస్తోందని టాక్. ఇప్పుడు ఈవిడ ఫుడ్ స్టాల్ ఓనర్ మాత్రమే కాదూ.. సోషల్ మీడియా స్టార్ కూడా. ఇప్పుడు ఈమె ఫుడ్ ఆరగించేందుకు స్వయంగా ఓ స్టార్ హీరో కూడా వచ్చాడండోయ్.

అతడు ఎవరో కాదూ యంగ్ స్టార్ సందీప్ కిషన్. ఊరి పేరు భైరవకోన  సినిమా ప్రమోషన్లలో భాగంగా కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్‌కు వెళ్లి కడుపారా భోజనం చేసింది చిత్ర యూనిట్. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ అక్కడకు వెళ్లి భోజనం చేశారు. ఆమెతో ముచ్చటించి.. అక్కడ ఉన్న ప్రేక్షకులతో ముచ్చటించారు సందీప్ కిషన్. మా సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదల అవతుందని, ఈ సినిమా చూడాలని పేర్కొన్నారు హీరో. కాగా, వీరితో పాటు దర్శకుడు వీఐ ఆనంద్ కూడా వెళ్లారు. ఇక ఈ మూవీని అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా ప్రమోషన్ల కోసం ఆమెను వినియోగించడంతో ఇంకా ఆమె ఫేమస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండోయ్. మీరు కుమారి ఆంటీ చేతి వంట రుచి చూసినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique