iDreamPost
android-app
ios-app

అక్కినేని అఖిల్ కి సమంత బర్త్ డే విషెస్

  • Published Apr 08, 2024 | 8:05 PM Updated Updated Apr 08, 2024 | 8:05 PM

Samantha Wishes To Akhil: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. అఖిల్ అక్కినేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఏడాది అఖిల్ కి అద్భుతంగా సాగాలంటూ ఆకాంక్షించింది.

Samantha Wishes To Akhil: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. అఖిల్ అక్కినేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఏడాది అఖిల్ కి అద్భుతంగా సాగాలంటూ ఆకాంక్షించింది.

  • Published Apr 08, 2024 | 8:05 PMUpdated Apr 08, 2024 | 8:05 PM
అక్కినేని అఖిల్ కి సమంత బర్త్ డే విషెస్

టాలీవుడ్ సిసింద్రీ, అక్కినేని అఖిల్ కి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా సిసింద్రీ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఈ సిసింద్రీ తాజాగా తన 30వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలు, నిర్మాతలు, స్టార్ హీరోయిన్స్ అంతా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాన్ ఇండియన్ హీరోయిన్ సమంత కూడా అక్కినేని అఖిల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అఖిల్ సమంత పెట్ తో ఉన్న ఫొటోని షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది.

అఖిల్ అక్కినేనికి సమంత పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ సమంత అక్కినేని కుటుంబంతో సఖ్యతగానే ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ సమంత- అఖిల్ మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. సమంత పెట్ డాగ్ తో ఉన్న అఖిల్ ఫొటోని సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీగా పెట్టి అఖిల్ కి బర్త్ డే విషెస్ చెప్పింది. “పుట్టినరోజు శుభాకాంక్షలు అఖిల్.. విషింగ్ యూ ఏ వండర్ ఫుల్ ఇయర్, గాడ్ బ్లెస్” అంటూ సమంత కోట్ చేసింది. ఇప్పటి వరకు విషెస్ రాకపోవడంతో అందరూ సమంత విష్ చేయదు అనుకున్నారు. కానీ, సమంత లేటుగా సోషల్ మీడియాకి వచ్చినట్లు అనిపించింది. రాగానే తాను ఇన్ స్టాగ్రామ్ వేదికగా అక్కినేని అఖిల్ కి పుట్టిరోజు శుభాకాంక్షలు చెప్పింది.

Samantha wishing akhil

ఇంక అఖిల్ సినిమాల విషయానికి వస్తే.. ఏజెంట్ తర్వాత అఖిల్ కాస్త గ్యాప్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఏజెంట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ విషయాన్ని స్వయంగా అఖిలే ఒప్పుకున్నాడు. తాము తీసిన సినిమా అనుకున్నట్లు రాలేదు అంటూ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఏడాది కావొస్తున్న తర్వాతి సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు అఖిల్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నాడో లేదో కూడా క్లారిటీ లేదు. అయితే యువీ క్రియేషన్స్ లో అఖిల్ 6 మూవీ కథ కూడా ఓకే అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చేశారు. కానీ, ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. పాత స్టిల్ తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు అంతే. ఆ పోస్టర్ లో ఎలాంటి కొత్తదనం లేదు. అఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ తప్పలేదు. మరి.. కామెంట్స్ రూపంలో అఖిల్ అక్కినేనికి పుట్టినరోజు శుబాకాంక్షలు తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabet