iDreamPost
android-app
ios-app

హేమ కమిటీ నివేదికపై స్పందించిన సమంత.. అవి కనీస అవసరాలంటూ

Samantha: జస్టిస్ హేమ కమిటీ నివేదికపై సౌత్ ఇండస్ట్రీ మొత్తం చర్చకు దారి తీసింది. నటీనటులు స్పందిస్తున్నారు. తాజాగా ఈ నివేదికపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా స్పందించింది. ఆమె ఏమన్నదంటే..?

Samantha: జస్టిస్ హేమ కమిటీ నివేదికపై సౌత్ ఇండస్ట్రీ మొత్తం చర్చకు దారి తీసింది. నటీనటులు స్పందిస్తున్నారు. తాజాగా ఈ నివేదికపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా స్పందించింది. ఆమె ఏమన్నదంటే..?

హేమ కమిటీ నివేదికపై స్పందించిన సమంత.. అవి కనీస అవసరాలంటూ

విభిన్న చిత్రాల ఇండస్ట్రీగా పేరు తెచ్చుకుంటున్న మాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది జస్టిస్ హేమ కమిటి నివేదిక. మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటీమణులు లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, ఎడ్జస్ట్ మెంట్ వాటికి గురౌతున్నరంటూ నివేదికలో పేర్కొంది. నివేదికలో విషయాలు వెలుగులోకి రావడంతో బాధిత నటీమణులు రేవతి సంపత్, మిను మునీర్ వంటి యాక్ట్రెస్ తమను సెక్సువల్ అబ్యూస్‌కు గురి చేశారంటూ కొంత మంది నటుల పేర్లు వెల్లడించారు. ప్రముఖ నటుడు సిద్దీఖీ, ముఖేస్ (నటి సరిత మాజీ భర్త), జయసూర్య, మణియం పిల్లరాజు, ఇడవేలు బాబు వంటి స్టార్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో సిద్దిఖీ.. మలయాళ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ) పదవికి రాజీనామా చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మూకుమ్మడి రాజీనామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఆరోపణలపై నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు స్టార్ హీరో మోహన్ లాల్.

కాగా, ఈ ఘటనపై టాలీవుడ్ స్టార్ నటి సమంత స్పందించింది. ఈ నివేదికపై ప్రశంసలు కురిపిస్తూ ఓ నోట్ పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ‘కేరళలోని ఉమెన్ ఇన్ సినమా కలెక్టివ్ (wcc) అద్భుతమైన పని తీరును కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్నా. మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవ ప్రదమైన పని ప్రదేశాలు మహిళల కనీస అవసరాలు. పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన, గౌరవ ప్రదమైన కనీస అవసరాలు ఉండాలి. వాటి కోసం ఎంతో మంది పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పుడు ఈ కమిటీ నివేదిక మార్పుకు నాంది అని భావిస్తన్నాను. WCCలోని నా స్నేహితులు, సోదరీమణులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేసింది.

sam reaction on hema commitee

హేమ కమిటీ నివేదికపై సౌత్ ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. పలు చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో సిటా డెల్ వెబ్ సిరీస్ చేసింది. వరుణ్ ధావన్ హీరోగా రాజ్ అండ్ డీకె తెరకెక్కిస్తున్నయాక్షన్ అండ్ డ్రామాలో నటించింది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్..త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. ఇటీవల ప్రోమోను విడుదల చేయగా.. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టింది సామ్. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలాలో ఓ మూవీ చేస్తుంది. వీటితో పాటు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి మూవీ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.