iDreamPost
android-app
ios-app

Salaar Vs Dunki: సలార్.. దెబ్బ అదుర్స్ కదూ.. డంకీకి తిరిగిచ్చేశాడు

  • Published Dec 22, 2023 | 12:37 PM Updated Updated Dec 22, 2023 | 1:04 PM

అసలు సిసలైన బాక్సాఫీస్ వార్ మొదలైంది. రెండు బడా ప్రాజెక్టులు డంకీ, సలార్ విడుదలయ్యాయి. రెండు వరుస హిట్లతో మంచి జోరు మీదున్న బాలీవుడ్ బాద్ షా, ఆరేళ్ల నుండి ప్లాపులతో ఉన్న ప్రభాస్ బాక్సాఫీస్ బరిలోకి దిగారు.. వీరిలో హిట్ కొట్టింది ఎవరంటే..?

అసలు సిసలైన బాక్సాఫీస్ వార్ మొదలైంది. రెండు బడా ప్రాజెక్టులు డంకీ, సలార్ విడుదలయ్యాయి. రెండు వరుస హిట్లతో మంచి జోరు మీదున్న బాలీవుడ్ బాద్ షా, ఆరేళ్ల నుండి ప్లాపులతో ఉన్న ప్రభాస్ బాక్సాఫీస్ బరిలోకి దిగారు.. వీరిలో హిట్ కొట్టింది ఎవరంటే..?

  • Published Dec 22, 2023 | 12:37 PMUpdated Dec 22, 2023 | 1:04 PM
Salaar Vs Dunki: సలార్.. దెబ్బ అదుర్స్ కదూ.. డంకీకి తిరిగిచ్చేశాడు

రెండు భారీ ప్రాజెక్టులు, ఇద్దరు బడా హీరోలు బాక్సాఫీసు బరిలో ఢీ కొంటే ఎలా ఉంటుందో తెలుసా.. అదే జరిగింది డంకీ, సలార్-ది సీజ్ ఫైర్ విషయంలో. నిజం చెప్పాలంటే.. ఇది మామాలూ పోటీ కాదూ. ఈ ఏడాది పఠాన్, జవాన్ రెండు హిట్లతో బాక్సాఫీసును ఏలుతున్న ఓ కింగ్ ఖాన్, ఆదిపురుష్ వంటి డిజాస్టర్ మూవీతో వచ్చిన డైనోసార్ మధ్య నెలకొన్న వార్ ఇది. షారూఖ్ ఖాన్ ముందు ప్రభాస్ తేలిపోతాడన్న బాలీవుడ్ మీడియాకు, సినీ ప్రముఖులకు బిగ్ షాకే ఇచ్చాడు సలార్ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సినిమా వైల్డ్ రేంజ్ లో హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసి డార్లింగ్ ఫ్యాన్స్.. అసలైన క్రిస్మస్ చేసుకుంటున్నారు. ఇది కదా ఇన్నాళ్ల నుండి రెబల్ స్టార్ నుండి కోరుకుంటున్నది అని ఆనందంతో గంతులేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ డంకీకి సలార్ మూవీ స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు

 డంకీ, సలార్.. ఈ రెండు సినిమాలు కొన్ని గంటల తేడాతో విడుదలయ్యాయి. అయితే బాద్ షా, బాలీవుడ్ మోస్ట్ వాటెండ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక వాయిదాల పడుతూ ఎట్టకేలకు థియేటర్లకు వచ్చిన సలార్ మూవీ.. బాక్సాఫీసును దున్నేస్తోంది. అమెరికా, దుబాయ్‌తో పాటు ఇండియా వ్యాప్తంగా బెనిఫిట్, స్పెషల్ షో కలెక్షన్లను ఊచకోత కోస్తుంది. అయితే ఇది ఊహించిదే అయినప్పటికీ.. కాస్త టెన్షన్ కూడా నెలకొంది అభిమానుల్లో. కారణం.. ప్రపంచ వ్యాప్తంగా షారూఖ్‌కు ఉన్న క్రేజ్. అందులోనూ వైఫల్యాలే చూడని డైరెక్టర్ హిరానీ దర్శకత్వంలో మూవీ తెరకెక్కడం. అయినప్పటికీ తమ సినిమాపై నమ్మకంతో విడుదల చేసేందుకు సిద్ధమైంది సలార్ టీం.

తొలుత డంకీ, సలార్ ఒకే రోజు విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ 22నే థియేట్లరలో సందడి చేస్తామని చెప్పింది డంకీ చిత్ర యూనిట్. ఇక్కడే మొదలైంది అసలు సిసలైన బాక్సాఫీసు వార్. ఇంతలో ఈ మూవీ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలను ఖండించిన డంకీ టీం.. ఆ రోజే వస్తామంటూ చెప్పి.. ఆ తర్వాత డిసెంబర్ 21కి రిలీజ్ డేట్ మార్చుకుంది. అలాగే డంకీ ఎప్పటి నుండే సినిమాను ప్రమోట్ చేసుకుంటూ వస్తోంది. కానీ ఈ డిసెంబర్ నుండే డార్లింగ్ మూవీ ప్రమోషన్లను షూరూ చేసింది. ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకుండా పాన్ ఇండియా మూవీగా బరిలోకి దిగింది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుంటే అసలు టెన్షన్ మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఓవర్సీస్ పరంగా.. కొన్నిచోట్ల ప్రభాస్ మేనియా కనబరుస్తుంటే.. మరికొన్ని చోట్ల షారూఖ్ హవా నడిచింది.

సినిమా విడుదల తేదీ దగ్గరపడ్డకొద్దీ బీటౌన్ సలార్ మూవీపై విషం కక్కడం ప్రారంభించింది. దీంతో నార్త్ వర్సస్ సౌత్ అన్నట్లుగా తయారయ్యింది. అలాగే సలార్‌కు అన్యాయం చేస్తూ.. ఉత్తరాదిలో పలు థియేటర్లు డంకీకి కేటాయించడం.. షారూఖ్ నేరుగా మల్టీఫ్లెక్స్ ఓనర్లకు నేరుగా ఫోన్ చేసి.. సలార్ మూవీకి థియేటర్లరు ఇవ్వొద్దంటూ చెప్పాడంటూ మీడియా కోడై కూసింది. పెద్ద హీరో ఫోన్ చేయడంతోనే పివీఆర్, ఐనాక్స్, మీరజ్ మల్టీప్లెక్స్ చైన్స్ .. డంకీ మాత్రమే ధియేటర్లలో ఆడించాలని నిర్ణయం తీసుకున్నాయి. డంకీ మూవీ విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.  తొలి రోజు డంకీ కేవలం గ్రాస్ కలెక్షన్ రూ. 95 కోట్లు మాత్రమే కొల్లగొట్టినట్లు టాక్.

కానీ ప్రభాస్ తన మేనియాతో.. కేవలం బెనిఫిట్, స్పెషల్ షో ద్వారా కేవలం బుక్ మై షో రూ. 45 కోట్లు వసూలు అయ్యినట్లు తెలుస్తోంది. ఇంకా నేరుగా థియేటర్లకు వెళ్లి చూసినవాళ్లు, థర్డ్ పార్టీకి ఈ కౌంటింగ్ ఈ ఖాతాలోకి రాలేదు. లెక్కలు కూడా బయటకు వస్తే.. సలార్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడు సలార్ మూవీకి వస్తున్న టాక్ తో నార్త్ ఇండియాలోని అనేక థియేటర్లు.. ఈ మూవీకి షిప్ట్ అవుతున్నాయట. ఈ మూవీకి తమ థియేటర్లను కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.  సలార్ తో పోటీ పడే విషయంలో వెనక్కు తగ్గని డంకీ మూవీకి గట్టి దెబ్బ వేసింది ఈ మూవీ. మొత్తానికి సౌత్ సినిమాపై విషం కక్కడం.. థియేటర్స్ ఇవ్వకపోవడం వంటి వాటికి సలార్ ప్రభంజనంతో తుడుచుకుపెట్టుకుపోయినట్టు అయ్యింది. దీంతో బాలీవుడ్ కి ప్రభాస్ సలార్ ఏక్ స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చి పడేసిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetnano girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş