స్తుతం డార్లింగ్ నటించిన సలార్ సినిమా బిజినెస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రెట్టింపు హైప్ క్రియేట్ చేసిన సలార్.. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. సలార్ తెలుగు స్టేట్స్ లో ఏకంగా రూ. 175 కోట్ల మేర బిజినెస్ చేసిందట. టాలీవుడ్ హిస్టరీలోనే ఇది టాప్ రికార్డు.
స్తుతం డార్లింగ్ నటించిన సలార్ సినిమా బిజినెస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రెట్టింపు హైప్ క్రియేట్ చేసిన సలార్.. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. సలార్ తెలుగు స్టేట్స్ లో ఏకంగా రూ. 175 కోట్ల మేర బిజినెస్ చేసిందట. టాలీవుడ్ హిస్టరీలోనే ఇది టాప్ రికార్డు.
ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చేశాయి. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత టోటల్ ఇండియన్ ఇండస్ట్రీలోనే చాలా మార్పులు వచ్చాయి. అందులో ఫలితంగా రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయిపోయాడు. అప్పటినుండి ప్రభాస్ చేసిన ప్రతీ సినిమా బిగ్ బడ్జెట్ తో.. హైప్ తో.. సాలిడ్ బాక్సాఫీస్ టార్గెట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నెక్స్ట్ రాబోయేవి కూడా పాత వాటికి ఏమాత్రం తగ్గకుండా బిజినెస్ జరుపుకుంటున్నాయి. అందులోనూ మేకర్స్ కాంబినేషన్ బట్టి కూడా సినిమాలకు బిజినెస్ గట్టిగా జరుగుతుంది. ప్రస్తుతం డార్లింగ్ నటించిన సలార్ సినిమా బిజినెస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అదేంటంటే.. ప్రభాస్ హీరోగా సలార్ సినిమాని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. సాలిడ్ యాక్షన్ మూవీగా సలార్ ని కేజీఎఫ్, కాంతార ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెట్టింపు హైప్ క్రియేట్ చేసిన సలార్.. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ వివిధ భాషలలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటిదాకా సినిమా నుండి పోస్టర్స్, టీజర్ తప్ప మిగతా ఏ అప్డేట్స్ రాలేదు. కానీ.. కావాల్సిన దానికంటే ఎక్కువ బజ్ ఉంది. అందుకు కారణం.. ప్రభాస్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్. వీరి కాంబోలో సాలిడ్ యాక్షన్ మూవీ వస్తుందంటే.. ఖచ్చితంగా అంచనాలు పీక్స్ లో ఉంటాయి. తాజాగా సలార్ బిజినెస్ తెలుగు రాష్ట్రాలలో ఊహించని రేంజ్ లో జరిగినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ లెక్కల ప్రకారం.. సలార్ తెలుగు స్టేట్స్ లో ఏకంగా రూ. 175 కోట్ల మేర బిజినెస్ చేసిందట. అసలు తెలుగు స్టేట్స్ లో ఇంతవరకు ఏ ఒక్క సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరగలేదు. టాలీవుడ్ హిస్టరీలోనే ఇది టాప్ రికార్డు. ఒకప్పుడు బడ్జెట్ రూ. 100 కోట్లు దాటుతోంది అనంటే వామ్మో అనుకునేవారు. అలాంటిది ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల వరకే సినిమా బిజినెస్ రూ. 175 కోట్లు అనంటే.. దాదాపు రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ క్రేజ్ ఎంత ఉన్నా.. సినిమాలకు ఈ స్థాయి బిజినెస్ జరిగితే రిస్క్ అనే చెప్పుకోవాలి. అదికూడా హీరో, ప్రొడ్యూసర్స్ కి భారమయ్యే రేంజ్ టార్గెట్ ఇది.
జనరల్ గా సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే ఈజీగా కొట్టేస్తుందని అనుకోవచ్చు. కానీ.. ఇప్పుడు ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ అవ్వట్లేదనే విషయం తెలుసు కదా.. స్టార్స్ ఉన్నారని బడ్జెట్, ఆశలు పెంచుకుంటూ పోతే ఎప్పటికైనా రిస్కే. ప్రభాస్ లాస్ట్ మూడు సినిమాలు నిరాశపరిచాయి. ఈసారి సలార్ తో అయినా సాలిడ్ బ్రేక్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కనీసం సలార్ అయినా.. హిట్ ట్రాక్ లో పడితే.. డార్లింగ్ క్రేజ్ రెట్టింపు అవుతుంది తప్ప వేరే ఏమి జరగదు. అయితే.. సలార్ కి ఎక్కువ బిజినెస్ చేసి ఫుల్లుగా వెనకేసుకుందామని నిర్మాతలు యోచిస్తున్నారని టాక్. సినిమాకు ఎంత క్రేజ్ ఉన్నా.. తెలుగు స్టేట్స్ లో రూ. 175 కోట్లు అనేది రిస్కీ టార్గెట్. అసలు ఇది రీచ్ అవ్వాలంటే బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు రిపీట్ ఆడియన్స్ రావాల్సి ఉంటుంది. వరుస నిరాశల తర్వాత కూడా.. ఎంత హైప్ ఉన్నా.. మరీ ఇంత పెద్ద టార్గెట్ అంటే ఎలా డార్లింగ్? అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి సలార్ టార్గెట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.