iDreamPost
android-app
ios-app

Salaar: వీడియో: ‘సలార్’ థియేటర్​లో రచ్చ చేసిన స్టార్ హీరో.. విజిల్స్ వేస్తూ..!

  • Published Dec 22, 2023 | 11:33 AM Updated Updated Dec 22, 2023 | 11:33 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీని చూసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్, మూవీ గోయర్స్​తో పాటు సెలబ్రిటీలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ‘సలార్’ ప్రదర్శిస్తున్న ఓ థియేటర్​లో ఒక స్టార్ హీరో రచ్చ రచ్చ చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీని చూసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్, మూవీ గోయర్స్​తో పాటు సెలబ్రిటీలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ‘సలార్’ ప్రదర్శిస్తున్న ఓ థియేటర్​లో ఒక స్టార్ హీరో రచ్చ రచ్చ చేశారు.

  • Published Dec 22, 2023 | 11:33 AMUpdated Dec 22, 2023 | 11:33 AM
Salaar: వీడియో: ‘సలార్’ థియేటర్​లో రచ్చ చేసిన స్టార్ హీరో.. విజిల్స్ వేస్తూ..!

‘సలార్’.. ఈ నామస్మరణతో దేశమంతా ఊగిపోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ కొత్త చిత్రం ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. అమీర్ పేట్ నుంచి అమెరికా వరకు ఇప్పుడంతా ఈ మూవీ మేనియానే నడుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్​లో సరికొత్త రికార్డులు పెట్టిన ‘సలార్’.. రిలీజ్ డే కలెక్షన్లలోనూ చరిత్ర సృష్టించేలా ఉంది. శుక్రవారం బిగ్​స్క్రీన్స్​లోకి వచ్చిన ఈ మూవీకి బెనిఫిట్ షో నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. యూఎస్​తోపాటు ఇండియాలో బెనిఫిట్స్, ఎర్లీ మార్నింగ్ షోస్ పడిన థియేటర్లలో ఆడియెన్స్ ప్రభాస్ మాస్ సంభవానికి ఊగిపోతున్నారు. ఇవేం ఎలివేషన్స్ రా బాబు.. అస్సలు ఎక్స్​పెక్ట్ చేయలేదంటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్​ను మెచ్చుకుంటున్నారు. డార్లింగ్​ను తాము ఎలా చూపించాలని అనుకున్నామో అలాగే చూపించినందుకు ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ప్రేక్షకులు, అభిమానులే కాదు.. సలారోడి మాస్ హీరోయిజాన్ని తెరపై చూసేందుకు సెలబ్రిటీలూ థియేటర్లకు పరుగులు పెడుతున్నారు.

‘సలార్’ మూవీని ప్రదర్శిస్తున్న ఓ థియేటర్​లో ఒక టాలీవుడ్ స్టార్ హీరో రచ్చ రచ్చ చేశారు. బిగ్​స్క్రీన్​లో తన ఫేవరెట్ హీరో కటౌట్​ను, మాస్ ఎలివేషన్స్​ను చూసి మురిసిపోయారు. విజిల్స్ వేస్తూ హల్​చల్ చేశారు. ఆ హీరో మరెవరో కాదు.. శ్రీ విష్ణు. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరు రా’ లాంటి హిట్స్​తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘సామజవరగమన’తో బ్లాక్​బస్టర్ కొట్టారు. అలాంటి శ్రీ విష్ణు ‘సలార్’ మూవీని చూసేందుకు ఎర్లీ మార్నింగ్ ఓ థియేటర్​లో వాలిపోయారు. తన ఫేవరెట్ హీరో స్క్రీన్ మీద చేస్తున్న మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్​ను చూసి ఈలలు వేస్తూ ఎంజాయ్ చేశారు. థియేటర్​లో శ్రీ విష్ణు రచ్చ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఇది ప్రభాస్ క్రేజ్ అని అంటున్నారు. హీరోలకు కూడా ఫేవరెట్ స్టార్ తమ హీరోనే అని కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీ విష్ణునే కాదు చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ‘సలార్’ మూవీని చూసేందుకు బిగ్​స్క్రీన్స్​కు వెళ్తున్నారు. థియేటర్​లో ఆడియెన్స్ మధ్య కూర్చొని ప్రభాస్ హీరోయిజంను ఎంజాయ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. యంగ్ హీరోలు నిఖిల్, నవీన్ పొలిశెట్టి కూడా ఈ చిత్రాన్ని చూసేశారు. మూవీ చూసిన తర్వాత రివ్యూను నెట్టింట ఫ్యాన్స్​తో పంచుకున్నారు. ‘సలార్ అద్భుతంగా ఉంది. చాలా రోజుల నుంచి అందరూ ప్రభాస్ అన్నను ఇలా చూడాలని ఎదురు చూశారు. చెప్పాను కదా.. బాక్సాఫీస్ బద్దలైపోద్దని. కంగ్రాట్స్ ప్రభాస్ అన్న’ అని నవీన్ పొలిశెట్టి ట్వీట్ చేశారు. ‘స్క్రీన్ మీద ప్రభాస్ భాయ్ కనిపించిన ప్రతిసారి గూస్​బంప్స్ వచ్చాయి. ఆయన ఓ అద్భుతం. ‘సలార్’ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. ప్రశాంత్ నీల్ ఒక విజువల్ స్పెక్టాకుల్​ను అందించారు. తప్పక చూడాల్సిన చిత్రం’ అని నిఖిల్ ఎక్స్​లో పోస్ట్ పెట్టారు. మరి.. ఆడియెన్స్​తో పాటు టాలీవుడ్ స్టార్స్​ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ‘సలార్’ సినిమాను మీరు చూశారా? ప్రభాస్ మూవీని చూసినట్లయితే మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Salaar: 6 ఏళ్ళ ఆకలి తీర్చిన సలార్. ఇది రెబలోడి ఊచకోత!

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss