Somesekhar
సలార్ మూవీ భారీ లాభాలను సాధించినప్పటికీ.. ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ మాత్రం వారికి డబ్బులు తిరిగిచ్చేశాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
సలార్ మూవీ భారీ లాభాలను సాధించినప్పటికీ.. ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ మాత్రం వారికి డబ్బులు తిరిగిచ్చేశాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన చిత్రం ‘సలార్’. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం, ఆ టైమ్ కు సలార్ పై ఉన్న బజ్ చూస్తే.. ఈ చిత్రం కచ్చితంగా రూ. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అందరూ భావించారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మూవీ లాభాలు రాబట్టినప్పటికీ.. ప్రొడ్యూసర్ వారికి డబ్బులు తిరిగిచ్చేశాడట. ఇంతకీ అసలేం జరిగిందంటే?
సలార్ మూవీకి ఓ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం హక్కులను దక్కించుకున్న మైత్రీ మూవీ మేకర్స్ మంచి లాభాలనే మూటగట్టుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ఏపీలో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ సలార్ రైట్స్ ను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. దీంతో అనుకున్నంతగా వసూళ్లు రాబట్టకపోవడంతో.. వారు నష్టాలను చవిచూసినట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త నిర్మాత విజయ్ కిరగందూర్ కు తెలియడంతో.. సదరు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన మెుత్తాన్ని తిరిగిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. అదేంటి? సలార్ సూపర్ హిట్ అయ్యింది కదా? మరి వారికి ఎలా నష్టాలు వచ్చాయి? అంటూ ఆలోచనలోపడిపోయారు. మరోవైపు సలార్ పార్ట్ 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపాడు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సీక్వెల్ ‘శౌర్యంగపర్వం’కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ లో షూటింగ్ జరిగితే.. వచ్చే ఏడాది సలార్ పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకురావడం గ్యారంటీ. మరి మంచి మనసుతో డిస్ట్రీబ్యూటర్లకు డబ్బులు తిరిగిచ్చేసిన నిర్మాతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: ఈ వారం థియేటర్లలో 15 సినిమాలు.. ఆ ముడింటిపైనే అందరి ఆసక్తి