ప్రముఖ ఓటిటికి సలార్ స్ట్రీమింగ్ రైట్స్! పూర్తి వివరాలివే..

  • Author ajaykrishna Updated - 01:13 PM, Wed - 13 September 23
  • Author ajaykrishna Updated - 01:13 PM, Wed - 13 September 23
ప్రముఖ ఓటిటికి సలార్ స్ట్రీమింగ్ రైట్స్! పూర్తి వివరాలివే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్, కాంతార సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసిన సలార్.. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సింది. కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా వేసుకుంది. నెక్స్ట్ రిలీజ్ డేట్ ఏంటనేది మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే.. సలార్ ఎప్పుడు రిలీజ్ అయినా.. థియేట్రికల్ గా రికార్డులు తిరగరాయడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఇప్పటికే సలార్ నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ అన్ని సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తూ వచ్చాయి. కానీ.. ఎంతో ఆశగా రిలీజ్ అవుతుంది అనుకున్న మూవీ.. వాయిదా అనేసరికి ఒక్కసారిగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. బట్.. ఎక్కడికీ బెస్ట్ అవుట్ ఫుట్ ఇస్తారనే నమ్మకంతో ఓపిక పడుతున్నారు. ఎందుకంటే.. డార్లింగ్ నుండి సాలిడ్ యాక్షన్ మూవీ చూసి చాలా కాలమైంది. అసలు సలార్ లాంటి ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ ప్రభాస్ ఇప్పటిదాకా చేయలేదు. సో.. ఎలాగైనా ఈసారి షూర్ షాట్ గా సలార్ పార్ట్ 1 కుంభస్థలం బద్దలు కొడుతోందని అంచనా వేస్తున్నారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. సలార్ పార్ట్ 1 ఓటిటి రైట్స్ డీల్ ముగిసినట్లు తెలుస్తోంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. సలార్ మూవీ పోస్ట్ థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలికాయట. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు చెల్లించని రేంజ్ లో సలార్ కి చెల్లించనున్నారట. ఇంతకీ.. సలార్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న ఓటిటి ఏదంటే.. నెట్ ఫ్లిక్స్. థియేట్రికల్ రన్ పూర్తి అయ్యాక సలార్ ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు డీల్ కుదుర్చుకుందట. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. దాదాపు రూ. 170 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు డీల్ జరిగిందని సమాచారం. ఇదిలా ఉండగా.. సలార్ లో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మరి సలార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments