iDreamPost
android-app
ios-app

రేసులో దిల్ రాజు.. సలార్ నైజాం రైట్స్ కి అన్ని కోట్లు పెట్టేశాడా..?

  • Author ajaykrishna Updated - 01:43 PM, Fri - 1 September 23
  • Author ajaykrishna Updated - 01:43 PM, Fri - 1 September 23
రేసులో దిల్ రాజు.. సలార్ నైజాం రైట్స్ కి అన్ని కోట్లు పెట్టేశాడా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ‘సలార్’. హోంబలే ఫిలిమ్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా.. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ని నెక్స్ట్ లెవెల్ యాక్షన్ మోడ్ లో ప్రెజెంట్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్.. ఫ్యాన్స్ అంచనాలన్నీ తారాస్థాయికి చేర్చింది. దీంతో ఎప్పుడెప్పుడు సినిమాని థియేటర్స్ లో చూసేద్దామా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మూవీ ట్రైలర్ తో ప్రమోషన్స్ మొదలు కానున్నాయట.

ఇక సలార్ సినిమాపై అంచనాలు చూస్తుంటే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదిగాక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్డమ్ ఏంటో.. ఆల్రెడీ సాహో, ఆదిపురుష్ సినిమాల ఓపెనింగ్స్ చూస్తే అర్ధమవుతుంది. అందులోనూ కేజీఎఫ్ మేకర్స్ తో ప్రభాస్, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ టైఅప్ అయ్యేసరికి.. సలార్ క్రేజ్ వరల్డ్ వైడ్ విస్తరించిపోయింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. సలార్ పార్ట్ 1 థియేట్రికల్ బిజినెస్ తెలుగు రాష్ట్రాలలో ఊహించని రేంజ్ లో జరిగేలా ఉందని టాక్. ఆల్రెడీ సలార్ నైజాం థియేట్రికల్ హక్కులు బిగ్ నెంబర్ కి లాక్ అయినట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఓ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే.. ఆ ప్రభావం తర్వాత సినిమాపై పడుతుందని అంటుంటారు. కానీ.. ప్రభాస్ సినిమాలకు దేనికదే సపరేట్ బిజినెస్ క్రియేట్ చేసుకుంటున్నాయి. సలార్ నైజాం రైట్స్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బరిలోకి దిగినట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల ప్రకారం.. సలార్ నైజాం హక్కులకు దిల్ రాజు.. రూ. 65 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్, రూ. 15 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ కోట్ చేసి సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. దాదాపు సలార్ తెలుగు వెర్షన్ కే రూ. 200 కోట్ల వరకు మేకర్స్ టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా.. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మరి సలార్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş