iDreamPost
android-app
ios-app

Salaar: వైరల్‌గా మారిన సలార్‌ మూవీ మేకింగ్‌ వీడియో!

సలార్‌ మూవీ డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. విడుదలైన ప్రతీ చోటా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయింది.

సలార్‌ మూవీ డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. విడుదలైన ప్రతీ చోటా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయింది.

Salaar: వైరల్‌గా మారిన సలార్‌ మూవీ మేకింగ్‌ వీడియో!

ప్రశాంత్‌ నీల్‌ తన తర్వాతి సినిమా ప్రభాస్‌తో సలార్‌ చేస్తున్నట్లు ప్రకటించగానే అంచనాలు మొదలయ్యాయి. కేజీఎఫ్‌ సినిమాలకు మించి సలార్‌ మూవీ ఉండబోతోందన్న ప్రచారం ఊపందుకుంది. సలార్‌ నుంచి వచ్చిన ప్రతీ చిన్న అప్‌డేట్‌ కూడా సంచలనంగా మారింది. టీజర్‌ దగ్గరినుంచి సెకండ్‌ ట్రైలర్‌ వరకు రికార్డులు క్రియేట్‌ చేశాయి. సలార్‌ మొదటి ట్రైలర్‌ డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు క్రియేట్‌ చేసింది.

18 గంటల్లో ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. కేజీఎఫ్‌ 2పై ఉన్న రికార్డులను పక్కకు నెట్టేసింది. కేజీఎఫ్‌ 2 కంటే నాలుగు గంటల ముందే సలార్‌ ఈ రికార్డును సాధించింది. ఇక, సలార్‌ నుంచి వచ్చిన సెకండ్‌ ట్రైలర్‌ కూడా రికార్డు క్రియేట్‌ చేసింది. అది కూడా 24 గంటల్లోపే 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ తెచ్చుకుంది. ఒక్క ట్రైలర్ల విషయంలోనే కాదు.. ప్రీ బుకింగ్స్‌ విషయంలోనూ సలార్‌ మూవీ తన సత్తా చాటింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ఓవర్‌సీస్‌లో రికార్డులు సృష్టించింది.

కోట్ల రూపాయల బిజినెస్‌ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆలస్యంగా ప్రీబుకింగ్స్‌ మొదలైనా ఊహించని స్థాయిలో బిజినెస్‌ జరిగింది. సలార్‌కు బెనిఫిట్‌ షోలు కూడా పడ్డాయి. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. మొదటి రోజు ఏకంగా 178 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. రెండవ రోజు 120 కోట్ల రూపాయలు.. మూడవ రోజు 80 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే 375 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసింది.

ఇలా ప్రతీ విషయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న సలార్‌ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హోంబలే ఫిల్మ్స్‌ ఈ వీడియోను తమ అఫిషియల్‌ ట్విటర్‌ ఖాతాలో విడుదల చేసింది. ఈ వీడియో 1.41 నిమిషా నిడివి ఉంది. సోమవారం  ఉదయం యూట్యూబ్‌లోకి రాగా.. 3 గంటల్లో 6 లక్షలకు పైగా వ్యూస్‌ తెచ్చుకుంది. కాగా, సలార్‌ సినిమా ప్రశాంత్‌ నీల్‌ 2014లో తెరకెక్కించిన ఉగ్రం సినిమాకు రీమేక్‌గా తెలుస్తోంది.

ప్రశాంత్‌ నీల్‌ తన కథకు పూర్తి న్యాయం చేయాలన్న ఉద్ధేశ్యంతో ఉగ్రం కథలో కొద్దిగా మార్పులు చేసి.. ప్రభాస్‌కు తగ్గట్టు మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. సలార్‌ సంచలన విజయం సాధించింది. స్నేహితుల మధ్య స్నేహం, విరోధంగా మారితే ఎలా ఉంటుందో చెప్పేదే ఈ మూవీ.. మరి, సలార్‌ మూవీ మేకింగ్‌ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.