iDreamPost
android-app
ios-app

సలార్‌ దూకుడు మామూలుగా లేదు.. ప్రభాస్‌ ఖాతాలోకి మరో రికార్డు!

సలార్‌ సినిమా డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అయింది. విడుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్లు సాధించింది.

సలార్‌ సినిమా డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అయింది. విడుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్లు సాధించింది.

సలార్‌ దూకుడు మామూలుగా లేదు.. ప్రభాస్‌ ఖాతాలోకి మరో రికార్డు!

సలార్‌ రికార్డుల పరంపర కొనసాగుతోంది. మొదటి ట్రైలర్‌ నుంచి ఇప్పటి కలెక్షన్ల వరకు రికార్డుల మీద రికార్డు క్రియేట్‌ అవుతున్నాయి. మొదటి ట్రైలర్‌ డిసెంబర్‌1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూట్యూబ్‌లో మొత్తం నాలుగు భాషల్లో విడుదల అయింది. విడుదలైన 18 గంటల్లోనే 100 మిలియన్ల మార్కును చేరుకుంది. కేజీఎఫ్‌ 2పై ఉన్న గత రికార్డులను తుడిచి పెట్టేసింది. ఇప్పటి వరకు 190కిపైగా మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.  ఇక, రెండో ట్రైలర్‌ కూడా విడుదలైన 24 గంటల్లోనే 100 మిలియన్ల మార్కును చేరుకుంది.

డిసెంబర్‌ 15 నుంచి మొదలైన సలార్‌ ప్రీ బుకింగ్స్‌ విషయంలో రికార్డులు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీ బుకింగ్స్‌ జరిగాయి. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో ప్రభాస్‌ రికార్డు సృష్టించాడు. విడుదలకు రెండు రోజుల ముందు తెలుగు నాట ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి. ఇక్కడ కూడా సలార్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. డిసెంబర్‌ 22న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

prabas create another record

భారీ అంచనాలకు మించి మొదటి రోజు ఏకంగా 178 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. రెండో రోజు 140 కోట్లు, మూడో రోజు 120 కోట్లు, నాలుగో రోజు 80 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. సినిమా విడుదలై 9 రోజులు అవుతున్నా వసూళ్లు మాత్రం తగ్గలేదు. ఓవర్‌సీస్‌లో అయితే, ప్రభాస్‌ ఖాతాలోకి ఓ కొత్త రికార్డు వచ్చి చేరింది. సలార్‌ సినిమాలో నార్త్‌ అమెరికాలో 8 మిలియన్ల గ్రాస్‌ మార్కును చేరుకుంది. కేవలం 9 రోజుల్లోనే సలార్‌ ఈ ఫీట్‌ను సాధించింది. రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 500 కోట్లకుపైగా వసూళు చేసింది.

కాగా, సలార్‌ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ నటించిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఈశ్వరీ రావు, జగపతి బాబు, బాబీ సింహా, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రాన్ని ‘ ఉగ్రం’ సినిమా రీమేక్‌గా తీశారు. ప్రభాస్‌కు తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఉగ్రం కథకు తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.

2014లో సినిమా విడుదల కాగా.. అప్పుట్లో కథకు అంత న్యాయం జరగలేదని చెప్పారు. ఎక్కువ మందికి తన కథ చేరాలన్న ఉద్దేశ్యంతోనే రీమేక్‌ చేస్తున్నానని అన్నారు. మరి, సలార్‌ మూవీ ప్రపంచ వ్యాప్తంగా క్రియేట్‌ చేస్తున్న రికార్డులపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.