iDreamPost
android-app
ios-app

సలార్, బాహుబలి-2 రికార్డు బ్రేక్ చేసిన హనుమాన్!

Hanuman Movie: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు హనుమాన్. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకెళ్తోంది. సంక్రాంతి పండగకి కానుగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఓ విషయంలో సలార్, బాహుబలి-2 సినిమాల రికార్డును హనుమాన్ బ్రేక్ చేసింది.

Hanuman Movie: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు హనుమాన్. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకెళ్తోంది. సంక్రాంతి పండగకి కానుగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఓ విషయంలో సలార్, బాహుబలి-2 సినిమాల రికార్డును హనుమాన్ బ్రేక్ చేసింది.

సలార్, బాహుబలి-2 రికార్డు బ్రేక్ చేసిన హనుమాన్!

హనుమాన్..ప్రస్తుతం ఎక్కడ చూసిన వినిపిస్తోన్న పేరు. ఎవరి నోట వెంట వచ్చిన ఇదే పేరు వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే దేశమంతాట హనుమాన్ పేరు మారుమోగి పోతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన తొలి సినిమాగా హనుమాన్ రికార్డు కొట్టింది. సంక్రాంతికి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు రికార్డులను సృష్టించిన హనుమాన్.. మరిన్ని రికార్డులను సృష్టించే దిశగా వెళ్తోంది. తాజాగా ఈ సినిమా ఓ విషయంలో సలార్, బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

క్రియేటీవ్ అండ్ యంగ్  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జా కాంబినేషన్ లో వచ్చిన చిత్రం హనుమాన్.  ఈ సినిమాలో తేజాకు జోడీగా అమృత అయ్యార్ నటించారు. అంతేకా వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విజువల్స్, సినిమా తీసిన విధానం అందరిని ఆకట్టుకుంది. అందుకే చిన్న సినిమాగా ప్రారంభంమై భారీ బడ్జెట్ సినిమాగా థియేటర్లోకి అడుగు పెట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే నుంచి పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో సైతం  ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరినట్లు ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. రూ.66 కోట్ల షేర్ ను రాబట్టినట్లు ట్రేడింగ్ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో స్క్రీన్ల సంఖ్య పెరగనుండటంతో హనుమాన్ భారీ లాభాలను చూడనున్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న హనుమాన్ మూవీ.. అనేక రికార్డులను సైతం బ్రేక్ చేస్తుంది. నార్త్ అమెరికాలో ఓ విషయంలో సలార్,బాహుబలి-2  రికార్డులను హనుమాన్ బ్రేక్ చేసింది. నార్త్ అమెరికాలో 4 రోజుల్లోనే 3 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. తద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా లిస్టులో టాప్-10లో హనుమాన్ స్థానం సంపాదించింది. అలాగే తొలివారం కలెక్షన్లలో సలార్, బాహుబలి-2 రికార్డులను హనుమాన్ బ్రేక్ చేసి.. తొలి స్థానంలో నిలిచింది. నార్త్ అమెరికాలో తొలివారంలో సలార్ 2.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అలాగే  బహుబలి-2.45 మిలియన్ల డాలర్లు తొలివారంలో రాబట్టింది. హనుమాన్ 3 మిలియన్ డాలర్లు వసూలు చేసి.. ఆ రెండు సినిమాల రికార్డులను దాటేసి నంబర్ 1 స్థానంలో నిలిచింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.