పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ వస్తున్న మూవీ ‘సలార్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా బహు భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద ఉండే హంగామా అంతా ఇంతా కాదు. దానికి తోడు ‘కేజీఎఫ్’ లాంటి సూపర్ డూపర్ హిట్‌ను తీసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న మూవీ కావడంతో ‘సలార్’కు హైప్ ఓ రేంజ్లో ఉంది. ప్రభాస్ సినిమాకు పోటీగా ఎవ్వరూ రాని పరిస్థితి. కానీ ఒక స్టార్ దర్శకుడు మాత్రం ‘సలార్’కు కాంపిటీషన్‌గా తన మూవీని బరిలోకి దించుతున్నాడు.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు ‘ది కశ్మీర్ ఫైల్స్’తో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన వివేక్ అగ్నిహోత్రి. ‘సలార్’కు పోటీగా తాను దర్శకత్వం వహించిన ‘ది వ్యాక్సిన్ వార్’ను రంగంలోకి దించుతున్నారు వివేక్. కొవిడ్ వైరస్ బారి నుంచి ప్రజల్ని రక్షించేందుకు వ్యాక్సిన్‌ను ఎలా కనిపెట్టారు? ఆ టైమ్‌లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? లాంటి ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం సిద్ధమవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో భారీగా రిలీజ్ చేయాలని వివేక్ భావిస్తున్నారు. ‘ది వ్యాక్సిన్ వార్’ను సెప్టెంబర్ 28న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించారు. ఇదే రోజున ‘సలార్’ కూడా రానుండటంతో బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా మారింది.
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘సలార్’ ముందు ‘ది వ్యాక్సిన్ వార్’ నిలుస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈమధ్య ప్రభాస్‌ను తరచూ టార్గెట్ చేసుకొని విమర్శలకు దిగుతున్న వివేక్ అగ్నిహోత్రి.. ఈసారి ఏకంగా ‘సలార్’ను లక్ష్యంగా చేసుకొని పోటీకి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే ఒకసారి ప్రభాస్‌తో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారాయన. డార్లింగ్ ‘రాధేశ్యామ్’, వివేక్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలు మార్చి 11న విడుదల అయ్యాయి. ఇందులో ప్రభాస్ మూవీ పరాజయం పాలవ్వగా.. ‘కశ్మీర్ ఫైల్స్’ సంచలన విజయం సాధించింది. మరోసారి సేమ్ సీన్ రిపీట్ చేయాలని వివేక్ అగ్నిహోత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘సలార్’ సత్తా తెలిసిన వాళ్లు మాత్రం దీన్ని తక్కువ అంచనా వేయలేరనే చెప్పాలి.
DATE ANNOUNCEMENT:
Dear friends, your film #TheVaccineWar #ATrueStory will release worldwide on the auspicious day of 28th September 2023.
Please bless us. pic.twitter.com/qThKxTjPiw— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 15, 2023