iDreamPost
android-app
ios-app

Pooja Vishweshwar: వీడియో: ‘సలార్’ నటికి ప్రమాదం.. ముఖం నిండా గాయాలతో..!

  • Published Jan 06, 2024 | 9:21 PM Updated Updated Jan 06, 2024 | 9:21 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్​’ సినిమా బ్లాక్​బస్టర్​గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీతో మంచి గుర్తింపు సంపాదించిన ఓ నటి ప్రమాదానికి గురయ్యారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్​’ సినిమా బ్లాక్​బస్టర్​గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీతో మంచి గుర్తింపు సంపాదించిన ఓ నటి ప్రమాదానికి గురయ్యారు.

  • Published Jan 06, 2024 | 9:21 PMUpdated Jan 06, 2024 | 9:21 PM
Pooja Vishweshwar: వీడియో: ‘సలార్’ నటికి ప్రమాదం.. ముఖం నిండా గాయాలతో..!

‘సలార్’.. గతేడాది బ్లాక్​బస్టర్స్​గా నిలిచిన మూవీస్​లో ఒకటి. ఏడాది ఆఖర్లో వచ్చిన ఈ ఫిల్మ్ బాక్సాఫీస్​ను షేక్ చేసింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత తన​ రేంజ్​కు తగ్గ హిట్ అందుకున్నారు. ఇటు టాలీవుడ్​తో పాటు అటు బాలీవుడ్​లోనూ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని చిత్రంతో బిజినెస్​లో ఉన్నవారికి లాభాలను పంచాడు డైనోసార్. బాలీవుడ్​ బాద్​షా షారుక్ ‘డంకీ’ రూపంలో గట్టి పోటీని తట్టుకొని మరీ రూ.650 కోట్లకు పైగా గ్రాస్​ను కలెక్ట్ చేసింది ‘సలార్’. అభిమానులు కోరుకునేలా ప్రభాస్​ను ఫుల్ మాస్, యాక్షన్​ అవతార్​లో చూపించి సక్సెస్ అయ్యారు దర్శకుడు ప్రశాంత్ నీల్. రెబల్ స్టార్​ను ఓ రేంజ్​లో ఆయన ఎలివేట్ చేశారు. ‘సలార్’ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో నటి పూజా విశ్వేశ్వర్ ఒకరు. అయితే ఆమె తాజాగా ఓ యాక్సిడెంట్​కు గురవ్వడం అందరికీ షాకిచ్చింది.

‘సలార్​’ సినిమాలో రెండు డైలాగులతో బాగా ఫేమస్ అయ్యారు పూజా విశ్వేశ్వర్. ‘రెండు నిమిషాలు బావా.. దొరసానిలా తయారుచేస్తా’ అని ఆమె చెప్పిన డైలాగ్​కు కౌంటర్​గా ప్రభాస్ మరో డైలాగ్ చెబుతారు. ‘రెండు నిమిషాలు.. దొరలా తయారుచేస్తా’ అని డార్లింగ్ చెప్పగానే థియేటర్​లో ఒకటే విజిల్స్. ఈ డైలాగ్స్​తో పూజ బాగా పాపులర్ అయిపోయారు. ఈ సినిమాకు ముందు పలు మూవీస్​లో నటించినా ‘సలార్​’తోనే ఆమె క్రేజ్​ సంపాదించారు. అలాంటి పూజ తాజాగా ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం​లోని అనకాపల్లి హైవే మీద ప్రయాణిస్తుండగా పొరపాటున ఒక డివైడర్​ను ఢీకొట్టారామె.

డివైడర్​ను ఢీకొట్టడంతో కిందపడిన పూజా విశ్వేశ్వర్ ముఖానికి గాయాలయ్యాయి. ఆమె కంటి భాగం దగ్గర కూడా ఇంజ్యురీ అయింది. ఆమె హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. ముఖం నిండా గాయాలతో ఉన్న పూజా విశ్వేశ్వర్ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్​ఫాదర్’, మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాల్లో పూజ యాక్ట్ చేశారు. వైవా హర్ష కొత్త సినిమా ‘సుందరం మాస్టర్​’తో పాటు ‘దక్షిణ’ అనే మరో మూవీలోనూ ఆమె నటిస్తున్నారు. ‘సలార్​’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజ ఇప్పుడిప్పుడే పెద్ద ఆఫర్లు అందుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇలా ప్రమాదానికి గురవ్వడం బ్యాడ్ లక్ అనే చెప్పాలి. దీని నుంచి ఆమె త్వరగా కోలుకొని స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్​తో పాటు పరిశ్రమ వర్గాలు కూడా కోరుకుంటున్నాయి.

ఇదీ చదవండి: Big Boss: బిగ్ బాస్‌లోకి పంపిస్తామంటూ మోసం.. సాక్షాలతో సహా బయటపెట్టిన యాంకర్

 

View this post on Instagram

 

A post shared by Tag Telugu (@tag.telugu)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetturka girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş