iDreamPost
android-app
ios-app

పేరెంట్స్ ముందే ఆ పని చేసిన సాయిపల్లవి.. ఇంతకీ ఆమె ఏం చేశారంటే..!

  • Author singhj Published - 03:26 PM, Sat - 8 July 23
  • Author singhj Published - 03:26 PM, Sat - 8 July 23
పేరెంట్స్ ముందే ఆ పని చేసిన సాయిపల్లవి.. ఇంతకీ ఆమె ఏం చేశారంటే..!

ఫిలిం ఇండస్ట్రీలో గ్లామర్​కు ఇచ్చే ప్రాధాన్యత గురించి తెలిసిందే. నటించే టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ, లుక్స్ కూడా బాగుండాలి. అప్పుడే అవకాశాలు దక్కుతాయి. కానీ అందం కంటే యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ముఖ్యమని రజినీకాంత్ లాంటి పలువురు స్టార్లు నిరూపించారు. పెద్దగా అందంగా లేకపోయినా స్టైలిష్ యాక్టింగ్​తో సూపర్​స్టార్​గా ఎదిగారు తలైవా. ఆ తర్వాత కాలంలో ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది నటులు తెరంగేట్రం చేశారు. హీరోల సంగతి అటుంచితే.. హీరోయిన్ల విషయంలో గ్లామర్​కు మేకర్స్ పెద్దపీట వేస్తుంటారు. ఒకప్పుడు అందంగా ఉండే హీరోయిన్లకు ఎక్కువగా అవకాశాలు దక్కేవి. ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా సాయిపల్లవి ఎంట్రీతో మార్పు వేగంగా వచ్చిందని చెప్పొచ్చు.

హీరోయిన్ అంటే అందం కాదు.. నటన ముఖ్యమని తాను పోషించిన పాత్రలతో చాటిచెప్పారు సాయిపల్లవి. అలాగని ఆమెను అందంలో తీసేయడానికి లేదు. సాయిపల్లవిని అభిమానులు న్యాచురల్​ బ్యూటీగా పిలుస్తుంటారు. సినిమాల్లో మేకప్​కు దూరంగా ఉంటూ న్యాచురల్ లుక్స్​తో, స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, అద్భుతమైన డ్యాన్సులతో కోట్లాది మంది ఫ్యాన్స్​ హృదయాలను ఆమె కొల్లగొట్టారు. మిగతా హీరోయిన్లలా కమర్షియల్ సినిమాల్లో ఛాన్సుల కోసం వెంపర్లాడరు సాయిపల్లవి. కథకు ప్రాధాన్యంతో పాటు తన పాత్రను ఎలా డిజైన్ చేశారు లాంటి విషయాలకు ఆమె అధిక ప్రాధాన్యం ఇస్తారు.

గ్లామర్​ షోకు దూరంగా ఉంటూ ఇంతమంది ఆడియెన్స్ మనసులను దోచుకోవడం అంటే మాటలా మరి! సినిమాలతో పాటు రియల్ లైఫ్​లోనూ సాయిపల్లవి చాలా సింపుల్​గా ఉంటారు. ఎంతో పద్ధతిగా ఉండే సాయిపల్లవి ఒక సందర్భంలో తన పేరెంట్స్ ఎదుటే స్మోక్ చేశారట. అయితే దీనికి ఒక కారణం ఉందట. స్మోకింగ్ చేయకూడదనే విషయంపై అవేర్​నెస్ ఇచ్చే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారట. సిగరెట్ తాగితే కలిగే నష్టాలను అక్కడ ఉన్న వారికి వివరించారట. అప్పుడు సాయిపల్లవి సిగరెట్ తాగగా.. ఆ టైమ్​లో తన పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారట. అయితే తాను తాగింది నిజమైన సిగరెట్ కాదని.. డమ్మీ సిగరెట్ అని సాయిపల్లవి క్లారిటీ ఇచ్చారు. స్మోకింగ్ వల్ల ప్రాణాలు పోవడమే గాక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయనే దృశ్యాన్ని అందరికీ చూపించేందుకే అలా చేశారట సాయిపల్లవి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet