iDreamPost
android-app
ios-app

తండేల్ షూట్‌లో సింపుల్‌గా సాయి పల్లవి.. ఇందుకు కదా పడి చచ్చిపోయేది

  • Published Mar 22, 2024 | 5:54 PM Updated Updated Mar 22, 2024 | 5:54 PM

సినిమా సెట్స్ పై ఉండగానే సీన్స్, పిక్స్ లీక్ అవుతున్నాయి. దేవర సెట్స్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న వీడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. తాజాగా సాయి పల్లవి పిక్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

సినిమా సెట్స్ పై ఉండగానే సీన్స్, పిక్స్ లీక్ అవుతున్నాయి. దేవర సెట్స్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న వీడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. తాజాగా సాయి పల్లవి పిక్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

  • Published Mar 22, 2024 | 5:54 PMUpdated Mar 22, 2024 | 5:54 PM
తండేల్ షూట్‌లో సింపుల్‌గా సాయి పల్లవి.. ఇందుకు కదా పడి చచ్చిపోయేది

ఇటీవల సినిమా సెట్స్ పై ఉండగానే లీకులు చోటుచేసుకుంటున్నాయి. సినిమాకు సంబంధించిన క్లిప్పో, లేక ఆడియో, వీడియోనో లీకు వీరులు రిలీజ్ చేసేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ జరగండి జరగండి సాంగ్ లీకైన సంగతి విదితమే. మొన్నటికి మొన్న పుష్ఫ 2లో రష్మికమందన్న పిక్ బయటకు వచ్చింది. నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. అలాగే దేవర నుండి జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో నడిచి వెళుతున్న దృశ్యాలు లీక్ అయ్యాయి. దీంతో తారక్‌ను చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. అయితే ఈ లీకుల కారణంగా సినిమాపై ప్రభావం చూపుతుందని తెలియని కొంత మంది అత్యుత్సాహ వంతులు ఈ పనికి దిగుతున్నారు.

తాజాగా మరో హీరోయిన్ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ముద్దుగుమ్మ, యునిక్ పర్సనాలిటీ, ఫిదా గర్ల్ సాయి పల్లవి పిక్ ఒకటి లీక్ అయ్యింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఈ షూటింగ్ సమయంలో తీసిన ఫోటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఓ పాపను ఒడిలో కూర్చొ బెట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి పిక్ హల్ చల్ చేస్తోంది. అందులో చాలా సింపుల్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తోంది. పంజాబీ డ్రెస్సులో, చాలా సాదా సీదా, చేతికి గాజులు వేసుకుని తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది అమ్మడు. ఆమె నవ్వుతుంటే.. ఇందుకు కదా అబ్బాయిలు పడి చచ్చిపోయేది అనిపించకమానదు. సాయి పల్లవి అంటేనే సింప్లీ లుక్, బ్యూటీఫుల్ స్మైల్. మరోసారి ఈ ఫోటోతో ఫిదా చేసేసింది.

Sai Pallavi was simple in Tandel

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న రెండో చిత్రం ఇది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన తొలి చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా సూపర్ సక్సెస్ కొట్టింది. తండేల్ చిత్రంలో బుజ్జి తల్లి పాత్రలో నటిస్తోంది ఈ మలార్. ఇండియా నుండి వేటకు వెళ్లి.. పాకిస్తాన్ అధికారులకు చిక్కిన జాలర్ల కథతో ఈ సినిమా రానుంది. ఇందులో చైతూ.. మత్య్సకారుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసిన సంగతి విదితమే. ఈ సినిమాకు చందూ మోండేటి దర్శకుడు. జీఎ2 పిక్చర్స్ నిర్మాణంలో బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తండేల్ దసరాకు విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş