iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండతో లవ్ స్టోరీకి సిద్ధమవుతున్న సాయిపల్లవి!

  • Published Jun 06, 2024 | 11:47 AM Updated Updated Jun 06, 2024 | 11:47 AM

Sai Pallavi, Vijay Devarakonda: నేచురల్ బ్యూటీ, లేడీ సూపర్ స్టార్ సాయిపల్లవి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ తో ప్రేమకథకు ఈ నేచురల్ బ్యూటీ రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

Sai Pallavi, Vijay Devarakonda: నేచురల్ బ్యూటీ, లేడీ సూపర్ స్టార్ సాయిపల్లవి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ తో ప్రేమకథకు ఈ నేచురల్ బ్యూటీ రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

  • Published Jun 06, 2024 | 11:47 AMUpdated Jun 06, 2024 | 11:47 AM
విజయ్ దేవరకొండతో లవ్ స్టోరీకి సిద్ధమవుతున్న సాయిపల్లవి!

సినిమాలు అన్నాక అనేక రకాల కాంబినేషన్లు  కనిపిస్తుంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల విషయంలో ఫ్యాన్స్ కి అనేక రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఫలానా కాంబినేషన్లు వెండితెరపై కనిపిస్తే బాగుంటుందని అనుకుంటారు. అంతేకాక సినిమాలకు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకునేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తి చూస్తుంటారు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సాయిపల్లవికి సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. విజయ్ తో ప్రేమకథకు ఈ నేచురల్ బ్యూటీ రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నేచురల్ బ్యూటీ, లేడీ సూపర్ స్టార్ సాయిపల్లవి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందంతో, గ్లామర్ తో మెప్పించే, ఆకట్టుకునే హీరోయిన్లు ఉంటారు. కానీ సాయిపల్లవి వారందరికి భిన్నంగా తన నేచురల్ గ్లామర్ తోనే యూత్ లో  మంచి క్రేజ్ సంబంధించింది. తెలుగులో ఫిదా సినిమాతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. అంతేకాకదు కథ ఎంపికలోనూ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందుకే సాయిపల్లవి సినిమా అంటే ఓ మంచి కథ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ కి కలిగింది. తన సహజ అందం, నటన, డ్యాన్సుతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది ఈ మలయాళ భామ.

ప్రేమమ్ చిత్రంతో కుర్రకారును ఎంతోగానో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఎక్స్‌పోజింగ్ అమడ దూరంలో ఉంటూ..అచ్చమైన తెలుగింటి  అమ్మాయిల కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో సాయిపల్లవి నటించింది తక్కువ సినిమాలే అయినా..అన్నీ ఆమెను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. సాయిపల్లవి ఎక్కువగా లవ్ స్టోరీ మూవీస్ లోనే కనిపించింది. ప్రేమమ్‌, ఫిదా, లవ్ స్టోరీ వంటి ఈ అమ్మడు నటించిన చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ చిత్రంలో మరోసారి సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో లవ్ స్టోరీ సినిమాకు సాయి పల్లవి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండతో ప్రేమకథకు ఈ బ్యూటీ సిద్ధమయినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండగా హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వం, దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా రెడీ అవుతుంది. ఇది ఒక బ్యూటీఫుల్  ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోబోతుందని సమాచారం. అయితే, ఈ సినిమాలో విజయ్ కి సరసన సాయిపల్లవిని తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై అటు సాయిపల్లవి కానీ, మూవీ మేకర్స్ కానీ అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్తలో వాస్తవమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం సాయి పల్లవి తండేల్‌,  అమరన్‌ అనే సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. వీటితో పాటు బాలీవుడ్‌లో కూడా రెండు ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి. విజయ్ సినిమా కానీ అధికారికంగా ఓకే అయితే..మరో సినిమా ఈ అమ్మడి ఖాతాలో పడినట్లే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss