iDreamPost
android-app
ios-app

ఊహించని రేంజ్ లో సలార్ థియేట్రికల్ బిజినెస్! తెలుగులో ఎంతంటే..

  • Author ajaykrishna Published - 03:27 PM, Tue - 11 July 23
  • Author ajaykrishna Published - 03:27 PM, Tue - 11 July 23
ఊహించని రేంజ్ లో సలార్ థియేట్రికల్ బిజినెస్! తెలుగులో ఎంతంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్, కాంతార చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు ఈ సలార్ ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ కాగా.. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. అయితే.. సలార్ మూవీపై అటు కామన్ ఆడియన్స్ లో, ఇటు డార్లింగ్ ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య సలార్ మూవీ.. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా.. సలార్ రిలీజ్ దగ్గర పడుతున్నకొద్ది రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే సలార్ మేకర్స్.. ప్రొడ్యూసర్స్.. టెక్నీషియన్స్ మూవీ గురించి చాలా ఇంటర్వ్యూస్ లో భారీ హైప్ క్రియేట్ చేశారు. దీంతో సలార్ కోసం రోజులు లెక్కపెడుతూ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల సలార్ టీజర్ చూసాక.. థియేటర్స్ లోకి వచ్చాక సలార్ బాక్సాఫీస్ లెక్కలు తిరగేస్తుందని సినీ విశ్లేషకులు సైతం అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాలలో మూవీ థియేట్రికల్ బిజినెస్ గురించి కొన్ని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్ కి తెలుగు స్టేట్స్ లో దాదాపు రూ. 197 కోట్లు జరిగినట్లు టాక్. ఏరియాల వారీగా చూసుకుంటే.. నైజాంలో రూ. 72 కోట్లు, ఆంధ్రాలో రూ. 90 కోట్లు.. సీడెడ్ లో రూ. 35 కోట్లుగా నమోదు అయినట్లు వినికిడి.

ఈ లెక్కలే నిజమైతే సలార్ మూవీకి బిగ్ టార్గెట్ తెలుగు స్టేట్స్ వరకు సెట్ అయినట్లే. ఇంకా మిగతా స్టేట్స్, ఓవర్సీస్.. వేరే కంట్రీస్ లో.. వేరే భాషలన్నీ కలుపుకుంటే బిగ్ రేంజ్ లో సలార్ లెక్కలు మారబోతున్నాయి. కాగా.. టీజర్ తో సలార్ కి పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు. సో.. సలార్ కే ఇలా ఉంటే.. పార్ట్ 2 కి వరల్డ్ వైడ్ ఏ రేంజ్ హైప్ రాబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ వరల్డ్ వైడ్ ఫేమ్ ఉన్న ప్రభాస్.. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రశాంత్ నీల్.. కాంబినేషన్ పై ఫ్యాన్స్ కి ఉన్న నమ్మకం వేరు. కాబట్టి.. ప్రభాస్ సినిమాలకు యావరేజ్ టాక్ వస్తేనే.. దుమ్మురేపుతాయి. అలాంటిది సలార్ కి హిట్, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే అంతే సంగతి. బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్ధలైపోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. మరి సలార్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom