iDreamPost
android-app
ios-app

నైజాంని షేక్ చేసిన RRR

  • Published Apr 06, 2022 | 11:13 AM Updated Updated Apr 06, 2022 | 11:13 AM
నైజాంని షేక్ చేసిన RRR

బాహుబలి 2ని ఈజీగా దాటేస్తున్న ఆర్ఆర్ఆర్ సునామి హోరు ఇంకా కొనసాగుతోంది. రెండో వారంలోకి అడుగు పెట్టాక కాస్త నెమ్మదిస్తుందనే అంచనాలకు భిన్నంగా ఇంకా బలంగా దూసుకుపోతోంది. ధరల పెంపు గడువు పూర్తి కావడంతో కామన్ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. బిసి సెంటర్లలో వసూళ్లు బలంగా ఉన్నాయి. ముప్పై శాతానికి మించి డ్రాప్ లేదని ట్రేడ్ పేర్కొంటోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర బాషల వెర్షన్లకు సైతం బ్రేక్ ఈవెన్ సాధించిన ట్రిపులార్ నార్త్ లోనూ అరుదైన రికార్డులు సొంతం చేసుకుంటోంది. నిజమైన ప్యాన్ ఇండియా అంటే ఏంటో బాక్సాఫీస్ సాక్షిగా కలెక్షన్లతో ఋజువు చేస్తోంది.

నిన్న సాయంత్రం నాటికి ఒక్క నైజాం నుంచే 100 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ దాటడం కనివిని ఎరుగని రికార్డుగా పంపిణీదారులు చెబుతున్నారు. సుమారు ఇరవై కోట్లకు పైగా లాభంతో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు ఫుల్ ఖుషీగా ఉన్నారట. అందుకే మొన్న ప్రత్యేకంగా టీమ్ అంతటిని పిలిచి స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఇంకా ఫుల్ రన్ దూరంలో ఉంది కాబట్తి భవిష్యత్తులో ఎవరూ అందుకోలేని బెంచ్ మార్క్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మళ్ళీ వీటిని దాటాలంటే రాజమౌళికి మాత్రమే సాధ్యమనేలా ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ కు బ్రహ్మరధం పడుతున్నారు. ఇప్పటికే 930 కోట్లను దాటేసిన ఈ విజువల్ వండర్ వెయ్యికి దగ్గరగా ఉంది.

వచ్చే వారం బీస్ట్, కెజిఎఫ్ 2 వస్తున్నప్పటికీ వాటి ప్రభావం మరీ తీవ్రంగా ఉండకపోవచ్చు. ఒకవేళ వాటికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనక ఆర్ఆర్ఆర్ నెమ్మదిస్తుంది. లేదూ ఫలితం ఏమైనా అటూ ఇటూ అయ్యిందంటే తిరిగి ఆర్ ఆర్ఆర్ కె ప్రయోజనం కలుగుతుంది. ఇవాళ హిందీ హక్కులు కొన్న పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ్డా ముంబైలో గ్రాండ్ సక్సెస్ పార్టీ ఇవ్వబోతున్నారు. అమీర్ ఖాన్ ముఖ్య అతిధిగా రావొచ్చని బాలీవుడ్ రిపోర్ట్. ఒక్క నార్త్ బెల్ట్ లోనే 200 కోట్లు దాటిన ఆర్ఆర్ఆర్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. తమిళనాడు, కర్ణాటక, కేరళలు ఆల్రెడీ లాభాల్లో ఉన్నాయి