iDreamPost
iDreamPost
ఇంకో 48 గంటలలోపే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ప్రీమియర్లు పడబోతున్నాయి. అభిమానుల ఎగ్జైట్మెంట్ మాములుగా లేదు. వెయ్యితో మొదలుపెట్టి అయిదు వేల దాకా టికెట్ ధరలు పలుకుతున్నా జనం లెక్క చేయడం లేదు. రాజమౌళితో పాటు ఇద్దరు హీరోల కాన్ఫిడెన్స్ చూసి బ్లాక్ బస్టర్ ఖాయమన్న నమ్మకం అందరిలోనూ నెలకొంది. అయితే కన్నడ వెర్షన్ కు సంబంధించిన అప్ డేట్ అక్కడి ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. టైం దగ్గర పడుతున్నా ఇప్పటిదాకా ఒక్క షో కూడా అందుబాటులోకి రాలేదు. తెలుగుతో పాటు తమిళం హిందీ వెర్షన్ల టికెట్లు సేల్ అవుతున్నాయి కానీ అసలైన కన్నడ బాషకు మాత్రమే ఇంకా స్క్రీన్లు కేటాయించనే లేదు.
లాంగ్వేజ్ రాకపోయినా సరే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కష్టపడి మరీ స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఒరిజినాలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఇతర పాత్రల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తెలుగు వెర్షన్ కే ఎక్కువ మొగ్గు చూపుతుండటంతో నిర్మాత సైతం నిస్సహాయంగా మిగిలినట్టు బెంగుళూరు రిపోర్ట్. ఇవాళో రేపో కొన్ని షోలు ఇచ్చినా అవి నామమాత్రమే అంటున్నారు. ఆ మధ్య జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ రాజ్ కుమార్ ఈ సమస్య వస్తుందని ముందే గుర్తించి కన్నడ వెర్షన్ కు ప్రాధాన్యం ఇమ్మని అర్థం వచ్చేలా హింట్ ఇచ్చారు. ఫైనల్ గా ఆయన భయపడినట్టే జరిగింది.మాతృభాషలో షోలు తగ్గిపోయాయి.
తెలుగు సినిమాలకు ఎప్పటి నుంచో కర్ణాటకలో బలమైన మార్కెట్ ఉంది. ఒకప్పుడు డబ్బింగులు నిషేధం ఉన్న టైంలోనే ఇంద్ర, ఘరానా మొగుడు, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్లు సిల్వర్ జూబ్లీ ఆడాయి. అలా అని ప్రతి ఒక్క కన్నడిగకు తెలుగు వస్తుందని కాదు. అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ కన్నడకు కాస్త బలమైన మార్కెటింగ్ చేస్తే సరిపోయేది. ఇప్పటికీ అక్కడ చాలా బిసి సెంటర్స్ లో ఒకటి రెండు థియేటర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అక్కడ కూడా తెలుగునే వేస్తే మన బాషరాని స్థానికులు చూసేందుకు ఇష్టపడరు. ఆల్రెడీ నార్త్ బుకింగ్స్ కొంత స్లోగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడీ డబ్బింగ్ ట్విస్టు తోడయ్యింది
Also Read : Bachchan Paandey : ఇలా అయ్యిందేంటి అక్షయ్