iDreamPost
android-app
ios-app

RRR Day 1 Collections : బాక్సాఫీస్ ని ఆక్రమిస్తున్న విజువలార్

  • Published Mar 26, 2022 | 1:06 PM Updated Updated Mar 26, 2022 | 2:06 PM
RRR Day 1 Collections : బాక్సాఫీస్ ని ఆక్రమిస్తున్న విజువలార్

ఊహించినట్టే ఆర్ఆర్ఆర్ వసూళ్ల ప్రభంజనం మొదలుపెట్టింది. టాక్ సంగతి ఎలా ఉన్నా జనం థియేటర్లకు వెళ్లేందుకు ఎగబడుతున్నారు. నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్స్ వీక్ గా మొదలైనప్పటికీ సాయంత్రంలోగా వచ్చిన మౌత్ పబ్లిసిటీ వల్ల ఈవెనింగ్ షోస్ నుంచి ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. ట్రేడ్ వీక్ గా భావించే బీహార్ రాష్ట్రంలో మొదటి రోజు 95 లక్షలు తేవడం ఓ ఉదాహరణ. లాక్ డౌన్ తర్వాత హయ్యెస్ట్ వచ్చిన వాటిలో మొదటిది సూర్యవంశీ. దాని ఫస్ట్ డే కలెక్షన్ కేవలం 55 లక్షలు. ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పికప్ అనూహ్యంగా ఉంది. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో ఆన్ లైన్ కంటే కరెంట్ బుకింగ్స్ బాగా వేగమందుకున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సుమారు 74 కోట్ల షేర్ తో ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా మరో పది కోట్లు అదనంగా ఉంటుంది. నాన్ బాహుబలిని తన పేరు మీద రాసుకునే దిశగా పరుగులు పెడుతోంది. జేమ్స్ ని కంటిన్యూ చేయడం వల్ల కర్ణాటక షేర్ ని తగ్గించుకున్న ఆర్ఆర్ఆర్ కథలో కనెక్టివిటీ కారణంగా కేరళలోనూ కొంత వీక్ గా ఉంది. సాయంత్రం నుంచి తమిళనాడులో పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇవాళ రేపు బుకింగ్స్ దాదాపు మొదటి రోజుతో సమానంగా ఉన్నాయి. కేవలం ఫస్ట్ డేకి మాత్రమే అగ్రిమెంట్లు చేసుకున్న థియేటర్లు దాన్ని సోమవారం దాకా పొడిగించుకున్నాయి. ఏరియాల వారిగా చూద్దాం

నైజామ్ – 23 కోట్ల 30 లక్షలు
సీడెడ్ – 17 కోట్లు
ఉత్తరాంధ్ర – 7 కోట్ల 40 లక్షలు
గుంటూరు – 7 కోట్ల 80 లక్షలు
ఈస్ట్ గోదావరి – 5 కోట్ల 35 లక్షలు
వెస్ట్ గోదావరి – 5 కోట్ల 93 లక్షలు
కృష్ణా – 4 కోట్ల 20 లక్షలు
నెల్లూరు – 3 కోట్లు

ఏపి / తెలంగాణ మొదటి రోజు షేర్ – 74 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా (తెలుగు తమిళం హిందీ) – 10 కోట్లు
ఓవర్సీస్ – 25 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే షేర్ – 109 కోట్లు

ఇవి ఖచ్చితమైన ఫిగర్స్ అని చెప్పలేం కానీ ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు చాలా మటుకు దగ్గరగా ఉన్నవే. కొన్ని మార్పులు ఉండొచ్చు. బాహుబలి 2ని ఇప్పుడు ఆర్ఆర్ఆర్ క్లియర్ గా టార్గెట్ చేస్తోంది. నిన్న దుబాయ్ లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే ప్రీమియర్ చేయడం లాంటి కారణాలు విదేశాల్లో నెంబర్స్ ని ప్రభావితం చేశాయి. యుఎస్ లో సులభంగా 4 మిలియన్ మార్కు దాటడం శుభపరిణామం. ఈ రోజు రేపు వారాంతం కావడంతో దేశవ్యాప్తంగా బుకింగ్స్ ట్రెండ్ చాలా స్పీడ్ గా ఉంది. కాకపోతే సోమవారం నుంచి ఎక్కువ నెమ్మదించకుండా స్పీడ్ మైంటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. బ్రేక్ ఈవెన్ దూరముంది ఇంకా.

Also Read : Jr NTR : అభిమానుల అసంతృప్తికి తారక్ బదులు