iDreamPost
iDreamPost
ఎన్నాళ్ళో వేచిన ఉదయం వచ్చేసింది. రేపు తెల్లవారకుండానే ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షోలతో సందడి మొదలుకాబోతోంది. టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయంగా బాహుబలితో ఎక్కడో నిలబెట్టేసిన రాజమౌళి ఇప్పుడీ మల్టీ స్టారర్ తో దాన్ని మరో పది మెట్లు పైకి ఎక్కించబోతున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. గత కొంత కాలంగా ఈ రేంజ్ గ్రాండియర్ తెలుగులో రాలేదు. రాధే శ్యామ్ ఉన్నప్పటికీ అది కనీస స్థాయిలో ఆడకపోవడంతో పాటు కంటెంట్ పరంగా ఎదురుకున్న విమర్శలు వంద కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చాయి. అందుకే దేశవ్యాప్తంగా ట్రేడ్ ఆశలన్నీ ఆర్ఆర్ఆర్ మీదే ఉన్నాయి. హైప్ అలా ఉంది మరి.
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల ఫస్ట్ టైం కాంబినేషన్ కావడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తమ హీరోలను స్క్రీన్ మీద చూసుకోవడం కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నారు. దానికి తగ్గట్టే టికెట్ రేట్ వేలల్లో పలుకుతున్నా లెక్క చేయడం లేదు. ఈ నేపథ్యంలో అసలు ఆర్ఆర్ఆర్ కు బిజినెస్ ఎంత జరిగింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ఉండొచ్చనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 195 కోట్ల దాకా టార్గెట్ పెట్టుకున్న ట్రిపులార్ దీన్ని దాటితేనే లాభాల్లోకి అడుగు పెడుతుంది. టికెట్ ధరలు చాలా విపరీతంగా ఉన్న పరిస్థితిలో ఏరియాల వారిగా బిజినెస్ అంత ఉందో ముందు చూద్దాం
నైజామ్ – 70 కోట్లు
సీడెడ్ – 37 కోట్లు
ఉత్తరాంధ్ర – 22 కోట్లు
ఈస్ట్ గోదావరి – 14 కోట్లు
వెస్ట్ గోదావరి – 12 కోట్లు
గుంటూరు – 15 కోట్లు
కృష్ణా – 13 కోట్లు
నెల్లూరు – 8 కోట్లు
ఏపి తెలంగాణ టోటల్ బిజినెస్ – 190 కోట్లు
కర్ణాటక – 40 కోట్లు
తమిళనాడు – 35 కోట్లు
కేరళ – 9 కోట్లు
హిందీ – 92 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 8 కోట్లు
ఓవర్సీస్ – 75 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం బిజినెస్ – 450 కోట్లు
సో బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఆర్ఆర్ఆర్ 455 కోట్ల దాకా రాబట్టుకోవాలి. ఒకవేళ బాహుబలిని మించిన టాక్ వస్తే ఇదేమి అసాధ్యం కాదు. పైగా రెండు వారాల పాటు టికెట్ రేట్ల పెంపు వెసులుబాటు ఉండటంతో ఫిగర్స్ లో చాలా మార్పులు ఉంటాయి. ఇది అంతిమంగా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది పబ్లిక్ సినిమా చూశాక ఎలా రెస్పాండ్ అవుతారనే దాని మీద ఆధారపడి ఉంది. నార్త్ లో బుకింగ్స్ నెమ్మదిగా ఉన్నప్పటికీ రెండో రోజు పికప్ అవుతాయని విశ్లేషకుల అంచనా. తెలుగు నేలపై మాత్రం రికార్డుల వేట ఉదయం ఆట నుంచే మొదలవుతుంది కాబట్టి సోషల్ మీడియా మొత్తం ఈ వార్తలతోనే నిండిపోనుంది
Also Read : Fans Hungama : ఫ్యాన్స్ అత్యుత్సాహానికి బ్రేకులు తప్పవు