iDreamPost
android-app
ios-app

RRRలో ఈ పాప గుర్తుందా…? ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

  • Published Sep 09, 2024 | 2:48 PM Updated Updated Sep 09, 2024 | 2:48 PM

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు నాటు పాటకు ఎన్ని అవార్డులు వచ్చాయో.. అంతే క్రేజ్ తెచ్చుకున్న సాంగ్ కొమ్మ ఉయ్యాల. ఇందులో నటించిన పాప గుర్తుందా. తన నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు నాటు పాటకు ఎన్ని అవార్డులు వచ్చాయో.. అంతే క్రేజ్ తెచ్చుకున్న సాంగ్ కొమ్మ ఉయ్యాల. ఇందులో నటించిన పాప గుర్తుందా. తన నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

  • Published Sep 09, 2024 | 2:48 PMUpdated Sep 09, 2024 | 2:48 PM
RRRలో ఈ పాప గుర్తుందా…? ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన మరో అద్భుత కళా ఖండం ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత పాత్రలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. 2022 మార్చి 25న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు ఆస్కార్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. తొలిరోజే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా నిలిచిపోయింది. ఇక 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజమౌళి ఆస్థాన విద్వాంసుడు, ఆయన సోదరుడు కీరవాణి సంగీతంతో చేసిన మ్యాజిక్ ఖండాంతరాలు దాటేసిన సంగతి విదితమే. ఇందులో ప్రతి పాట ఆణిముత్యమే. నాటు నాటు నాటు పాట ప్రపంచవేదికలపైన మార్మోగింది.

ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను తెచ్చిపెట్టింది ఈ పాట. ఇక ఫ్రెండ్ షిప్, జనని, కొమురం భీముడే, ఎత్తర జెండా సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో నాటు నాటు సాంగ్ తర్వాత.. చిన్నా,పెద్దను ఆకట్టుకున్న సాంగ్..‘కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా..అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా, రోజూ ఊగాలా’. ఈ సాంగ్‌లో చక్కని హవా భావాలతో నటించిన చిన్నారి గుర్తుందా? ఈ మూవీలో ఈ చిన్నారిది కీ రోల్. పాటలు బాగా పాడుతుందని ఈ గోండు జాతి పిల్లను తీసుకెళ్లిపోతారు బ్రిటీష్ రాణి. ఆమెను తీసుకు వచ్చేందుకు సిటీకి వెళతాడు.. మన తారక్. ఈ సినిమాలో మల్లి పాత్రలో నటించి మెప్పించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..? ఆ పాప పేరు ట్వింకిల్ శర్మ. ఆమె చత్తీస్ గఢ్‌కు చెందిన అమ్మాయి.

RRR Movie Child Actress

ఆమెకు డ్యాన్స్ అంటే విపరీతమైన ప్రాణం. అందుకే చిన్నప్పటి నుండి డ్యాన్స్ రియాలిటీ షోల్లో పాల్గొనేది. అలా డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌లో పార్టిసిపేట్ చేసింది. అలాగే పలు యాడ్స్‌లో నటించింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ప్లిఫ్ కార్ట్‌లో ఆమె యాడ్ చూసిన రాజమౌళి ఆమెను త్రిపుల్ ఆర్ మూవీకి ఆఫర్ చేశాడు. ఆమెను అహ్మాదాబాద్‌లో ఆడిషన్ ఇచ్చాక.. ఏడాది తర్వాత ఆమెకు మల్లి క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది. ఈ విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ట్వింకిల్ శర్మ. సినిమా విడుదలకు చిన్నపిల్లలా ఉన్న ఆమె.. ఇప్పుడు పెద్దదయ్యింది. సోషల్ మీడియాలో తన ఫోటోలతో, వీడియోలతో రచ్చ చేస్తుంది. చూసేందుకు ప్రేమలు బ్యూటీ మమితా బైజును తలపిస్తుంది. ఫ్యూచర్‌లో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

 

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet