RRR : నార్త్ లో బాహుబలి రేంజ్ టాక్ రావాల్సిందే

ఇంకో మూడే రోజుల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినట్టే ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. బెనిఫిట్ షో టికెట్ ధర ఏకంగా 5 వేల రూపాయలంటేనే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి 2 రికార్డులు బద్దలు కావడం ఖాయమేనని ట్రేడ్ పండితుల అంచనా. అయితే నార్త్ లో హిందీ వెర్షన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో జోష్ కనిపించడం లేదు. ముంబై, పూణే, ఢిల్లీ, కోల్కతా తదితర నగరాల్లో ఆన్ లైన్ టికెట్లు కొన్నవాళ్ళ సంఖ్య పట్టుమని 20 శాతం కూడా దాటలేదు. ఎర్లీ మార్నింగ్ షోలతో మొదలుపెట్టి మ్యాట్నీ, సెకండ్ షోలు అన్నిటిది ఇదే పరిస్థితి. ఇంకా టైం ఉంది కాబట్టి వేచి చూడాలి.

అన్నిటికన్నా తక్కువ బుకింగ్ భోపాల్ లో ఉన్నాయి. కేవలం 4 శాతంతో మరీ నెమ్మదిగా ఉంది. వడోదరలో 9 శాతం దాటలేదు. హిందీ డబ్బింగ్ హైదరాబాద్ లోనూ 37 శాతం దగ్గరే ఉంది. ముంబై అహ్మదాబాద్ లో మాత్రమే 11 శాతంతో కొంత మెరుగ్గా ఉంది. రాజమౌళి చాలా విస్తృతంగా దేశవ్యాప్తంగా ప్రమోషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అవసరానికి మించి ఇద్దరు హీరోలతో విమానాల్లో రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నారు. విసుగు రాకుండా ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కపిల్ శర్మ లాంటి నార్త్ సెలబ్రిటీలతో పాటు తమిళ మలయాళం కన్నడకు చెందిన యాంకర్స్ తో ప్రోగ్రాంస్ చేశారు.

ఇంత చేస్తే హిందీ ట్రిపులార్ కు ఈ రెస్పాన్స్ రావడం ఊహించని పరిణామం. అయితే రిలీజ్ టైంలో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని, ఒక్కసారి బ్లాక్ బస్టర్ టాక్ బయటికి వస్తే బాహుబలి రేంజ్ లో వసూళ్ల వర్షం ఖాయమని అక్కడి విశ్లేషకుల అంచనా. ఇది దాని తరహాలో విజువల్ ఎఫెక్ట్స్ తో నిండిన ఫాంటసీ మూవీ కానప్పటికీ గ్రాండియర్ విషయంలో ఆర్ఆర్ఆర్ ఏ మాత్రం తీసిపోలేదని ట్రైలర్ చూశాక అర్థమయ్యింది. కాకపోతే అక్కడి కామన్ ఆడియన్స్ రామరాజు, భీమ్ లను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ డే ఉత్తరాదిలో ఎలా ఉన్నా ఓవర్ సీస్, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓ రేంజ్ లో కలెక్షన్ల జాతర జరగడం ఖాయం

Also Read : Beast & KGF Chapter 2 : కెజిఎఫ్ 2ని లెక్క చేయని బీస్ట్

Show comments