iDreamPost
android-app
ios-app

ఫాల్కే బయో పిక్ లో మరో కీలక మలుపు

  • Published May 17, 2025 | 12:09 PM Updated Updated May 17, 2025 | 12:09 PM

సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్రను .. ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇద్దరు హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వినిపిస్తుంది దానికి సంబందించిన వివరాలను పూర్తిగా చూసేద్దాం.

సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్రను .. ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇద్దరు హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వినిపిస్తుంది దానికి సంబందించిన వివరాలను పూర్తిగా చూసేద్దాం.

  • Published May 17, 2025 | 12:09 PMUpdated May 17, 2025 | 12:09 PM
ఫాల్కే బయో పిక్ లో మరో కీలక మలుపు

దాదా సాహెబ్ ఫాల్కే గురించి ప్రపంచానికి తెలియజేయాలి అనుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. ఇప్పుడిప్పుడే దీనికి సంబందించిన విషయాలు బయటకు వస్తున్నాయి. మొదట జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ను చేస్తున్నారనే టాక్ వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఆనందించే లోపే.. ఈ ప్రాజెక్ట్ లో అమీర్ ఖాన్ పేరు కూడా వినిపించింది. దీనితో అందరూ డైలమాలో పడిపోయారు. ఈ ప్రాజెక్ట్ ను తారక్ చేస్తాడా.. లేదా అమీర్ ఖాన్ చేస్తాడా.. లేదా ఎవరి వెర్షన్ లో వాళ్ళు చేస్తారా అనే సందేహాలు మొదలయ్యాయి.

ఇలా ఉండగానే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో మరో కొత్త విషయం బయట పడింది. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసల్కర్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడు సంవత్సరాల నుంచి తమను అమీర్ ఖాన్ బృందం ఫాలో అప్ చేస్తున్నారని. వాళ్ళ రీసెర్చ్ తమకు నచ్చిందని. హిరానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే రాజమౌళి తరపున తమను ఎవరు కలవలేదని కూడా చెప్పారు. అంతే కాకుండా . ఫాల్కే భార్య సరస్వతి బాయ్ ఫాల్కే పాత్రలో విద్య బాలన్ అయితే బాగుంటుందని కూడా చెప్పడం గమనార్హం.

చూడబోతుంటే ఈ విషయం ఎక్కడివరకు దారి తీస్తుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. అటు రాజమౌళి కానీ ఇటు ఎన్టీఆర్ కానీ దీని గురించి అఫీషియల్ గా ఇప్పటివరకు మాట్లాడింది లేదు. అలాగే అటు అమీర్ వైపు నుంచి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. కానీ ఇటు మీడియా సోషల్ మీడియాలో మాత్రం అమీర్ vs తారక్ అనే డిబేట్ లు కొనసాగుతున్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.