RRR : అంచనాలను మించేసిన ట్రిపులార్ సంబరం

నిన్న సాయంత్రం బెంగుళూరు దగ్గర చిక్ బళ్లాపూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బయట ప్రచారం జరిగినట్టు చిరంజీవి బాలకృష్ణ లాంటి ప్రత్యేక అతిథులెవరూ రాలేదు కానీ కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్, శాండల్ వుడ్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ వేడుకకు హాజరయ్యారు. సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ సంబరంలో క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఒకదశలో రాజమౌళి మైకు తీసుకుని ఆగ్రహంతో ఊగిపోయి స్టేజి మీద ఉన్న బాడీ గార్డులు, పెర్ఫార్మన్స్ ఇచ్చిన డాన్సర్లు అందరూ కిందకు వెళ్లిపోవాలని గద్దించి ఆపై సారీ చెప్పడం ఒక ట్విస్టు.

ఇక చిరంజీవి గురించి చెబుతూ జక్కన్న ఆయనే ఇండస్ట్రీ పెద్దని, టికెట్ రేట్ల విషయంలో రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని, ఎన్నెన్ని మాటలు అన్నా ఇండస్ట్రీ బాగు కోసం అవన్నీ పడ్డారని చెప్పడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ని ఉద్దేశించి ఎప్పుడూ నా పక్కనే ఉండు అని పరస్పరం కౌగిలించుకోవడం, చరణ్ పునీత్ గురించి ఎమోషనల్ కావడం ఇవన్నీ ఆకట్టుకున్న అంశాలు. చిరు అక్కడే కాదు కర్ణాటకలో కూడా మెగాస్టార్ అని సిఎం శివరాజ్ బొమ్మై పేర్కొనడం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేసింది. మొత్తానికి అంగరంగ వైభవంగా ట్రిపులార్ సెలబ్రేషన్ ముగిసింది.

ఏ హైదరాబాదో వైజాగో కాకుండా బెంగుళూరులో ఈవెంట్ చేయడం ద్వారా ఆర్ఆర్ఆర్ పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు అక్కడి మార్కెట్ చాలా కీలకం. జేమ్స్ మీద సానుభూతి వెల్లువలా ఉన్న తరుణంలో జనాన్ని దీని వైపు మళ్ళించాలంటే అంత సులభం కాదు. పునీత్ మూవీ రెగ్యులర్ గా ఉన్నా సరే అప్పు మీద ప్రేమతో దాన్ని ఎగబడి చూస్తున్నారు. పైగా అక్కడి హక్కులు కొన్న నిర్మాత ఆర్ఆర్ఆర్ మీద భారీ పెట్టుబడి పెట్టారు. సో ఓపెనింగ్స్ చాలా కీలకం. కనివిని ఎరుగని స్థాయిలో రావాలి. ఎలాగూ టాక్ మీద నమ్మకం ఉంది కాబట్టి లాంగ్ రన్ నిలబడేలా చూసుకోవాలి. ఇప్పుడదే కీలకం

Also Read : Mishan Impossible : ఆర్ఆర్ఆర్ పోటీని తట్టుకోవడానికి ఓ చిన్న సినిమా రెడీ కావడం విశేషమే

Show comments