కెప్టెన్ భార్య అంటూ నటి ఫోటోలు వైరల్.. సీరియస్‌గా స్పందించిన బ్యూటీ

గత జులైలో అగ్ని ప్రమాదంలో దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ మరణించగా.. తాజాగా ఆయన కుటుంబానికి కీర్తి చక్రతో సత్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అయితే ఆ తర్వాత పరిణామాలు కెప్టెన్ భార్య స్మృతిపై విమర్శలు గుప్పించేలా చేశాయి. అయితే

గత జులైలో అగ్ని ప్రమాదంలో దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ మరణించగా.. తాజాగా ఆయన కుటుంబానికి కీర్తి చక్రతో సత్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అయితే ఆ తర్వాత పరిణామాలు కెప్టెన్ భార్య స్మృతిపై విమర్శలు గుప్పించేలా చేశాయి. అయితే

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాస్తుంటారు జవాన్లు. విధి నిర్వహణలో తల్లిదండ్రులు, భార్యా బిడ్డల్ని వదిలేసి నెలలు కాదు సంవత్సరాల తరబడి కూడా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు. చలి చంపేస్తున్నా, వానలు ముంచెత్తుతున్నా, ఎండలు దంచికొడుతున్నా.. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎటు నుండి ఏ ఆపద వస్తుందో అని అలర్ట్‌గా ఉంటారు. కంటి మీద కునుకు వేయకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. దేశ ప్రజలకు సేవ అందిస్తున్న జవాన్లు.. యుద్దాల్లో, విపత్కర పరిస్థితుల్లో మరణిస్తే.. వారి కుటుంబాలకు శౌర్యపురస్కారాలను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా పదిమంది వీర సైనికులను ప్రతిష్టాత్మక కీర్తి చక్రతో సత్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కీర్తి చక్రను అందుకున్న వారిలో దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కుటుంబీలు కూడా ఒకరు.

సియాచిన్ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తోటి సైనికులు, వైద్య సామాగ్రి, పరికరాలను తెచ్చే క్రమంలో అగ్నికి ఆహుతై.. వీర మరణం పొందాడు అన్షుమాన్ సింగ్. పెళ్లయిన రెండు నెలలకే తనువు చాలించాడు. దీంతో కెప్టెన్ కుటుంబాన్ని కీర్తి చక్రతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వ. కీర్తి చక్ర పతకాన్ని భార్య స్మృతి సింగ్, తల్లి మంజు సింగ్ అందుకున్నారు. ఇదిలా ఉంటే స్మృతి సింగ్ పై నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. అత్త, మామల్ని వదిలేసి ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. అతని మరణం తర్వాత వచ్చిన నగదు అంతా కోడలు తీసుకుందని, తాము కొడుకు ఫోటో చూసుకోవడం తప్ప.. తమకు ఏం మిగల్లేదని వాపోయారు అన్షుమాన్ సింగ్ పేరెంట్స్. దీంతో స్మృతిపై నెగిటివిటీ మూటకట్టుకుంది.

కాగా, ఈ ఘటనలో ఇరుక్కుపోయింది కేరళకు చెందిన నటి, ఇన్ఫ్లుయెన్సర్ రేష్మా సెబాస్టియన్. తాను చూడటానికి స్మృతిలా ఉండటంతో.. కొంత మంది సోషల్ సైనికులు ఆమె ఫోటోలు పెడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో నటి ఫైర్ అయ్యింది. అన్షుమాన్ సింగ్ భార్య స్మృతి సింగ్ తాను కాదని స్పష్టం చేసింది. తాను అన్షుమాన్ భార్యను కాదని, ట్రోల్ చేసే ముందు తన ఇన్ స్టా బయో డీటెయిల్స్ చూడండని హితవు పలికింది. దయచేసి తప్పుడు సమాచారం, ద్వేషపూరిత వ్యాఖ్యలను వ్యాప్తి చేయడం మానుకోండి అటూ స్పష్టం చేసింది. రేష్మాతో పాటు ఆర్మీ అధికారి భార్యను ట్రోల్ చేస్తున్న వ్యక్తి ఫేస్ బుక్ పోస్టు స్క్రీన్ షాట్లను షేర్ చేసింది. తప్పుడు ప్రచారం చేయడానికి తన పేరు ఉపయోగించుకోవడం సబబు కాదని, చట్టపరమైన చర్యలు తీసకుంటానని హెచ్చరించింది.

Show comments