iDreamPost
android-app
ios-app

ఆ నలుగురు నటులు నన్ను వేధించారు! రాత్రి రూమ్‌కి పిలిచి!

జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక సినీ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. యావత్ సినీ లోకాన్ని షాక్ కు గురి చేసింది. ఇటీవల నటి రేవతి సంపత్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకోగా, ఇప్పుడు మరో నటి కూడా తన గళాన్ని విప్పింది.

జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక సినీ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. యావత్ సినీ లోకాన్ని షాక్ కు గురి చేసింది. ఇటీవల నటి రేవతి సంపత్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకోగా, ఇప్పుడు మరో నటి కూడా తన గళాన్ని విప్పింది.

ఆ నలుగురు నటులు నన్ను వేధించారు! రాత్రి రూమ్‌కి పిలిచి!

మాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ జస్టిస్ హేమ కమిటీ విడుదల చేసిన నివేదిక సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం మలయాళ ఇండస్ట్రీనే కాదు.. సౌత్ మొత్తం దీనిపై చర్చించేలా చేసింది. ఈ క్రమంలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడిస్తున్నారు నటీమణులు. తనపై ప్రముఖ నటుడు, నిర్మాత సిద్దిఖీ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది నటి రేవతి సంపత్. ఈ క్రమంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. మరో దర్శకుడు రంజిత్ పై కూడా ఇలాంటి ఆరోపణలే రావడంతో అతడు కూడా తన పదవిని వదులుకున్నాడు. ఇప్పుడు మరో నటి మిను మునీర్ తాను లైంగిక వేధింపులకు బాధితురాలినయ్యాంటూ బాంబు పేల్చింది. తన తోటి నటులే తనను సెక్సువల్ హర్రాస్ చేశారంటూ పేర్కొంది.

ఈ మేరకు మిను ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్టు పంచుకుంది. అందులో ‘ 2013లో ముఖేష్, మణియం పిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య అనే నలుగురు నటులు సెట్స్‪లో నన్ను శారీరకంగా, మాటలతో వేధించారు’ అని పేర్కొంది. అయితే దీనిపై ఆమె ఓ ప్రముఖ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘ ఓ సినిమా షూటింగ్‌లో చేదు అనుభవం ఎదుర్కొన్నాను. నేను టాయిలెట్‌కి వెళ్లి బయటకు రాగానే జయసూర్య నా అనుమతి లేకుండా వెనుక నుండి వచ్చి కౌగిలించుకుని, ముద్దులు పెట్టాడు. వెంటనే షాక్ గురయ్యా. నీకిష్టమైతే.. మరింత ముందుకు వెళతాను అన్నాడు’ అని తెలిపింది ఈ నటి. అమ్మ మాజీ కార్యదర్శి ఇడవెల బాబును సభ్యత్వ దరఖాస్తు కోసం సంప్రదించగా.. తన ఫ్లాట్‌కు పిలిచి శారీరకంగా వేధించాడని తెలిపింది.

అలాగే ప్రస్తుత కేరళ అధికార పార్టీ ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ కూడా తనను కమిట్ మెంట్ నిరాకరించిన తర్వాత.. తనకు సభ్యత్వం ఇవ్వకుండా నిరాకరించారని పేర్కొంది. మలయాళ చిత్ర పరిశ్రమలో దోపీడి ఎక్కువగా ఉందని, అందుకు సాక్షిని తానేనని తెలిపింది. ఈ వేధింపులు తట్టుకోలేక చివరకు మలయాళ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయానని, మరో పరిశ్రమకు మకాం మార్చినట్లు చెప్పింది. ఇదిలా ఉంటే తనపై ఆరోపణలు రావడంతో మణియం పిళ్ల రాజు స్పందిస్తూ.. తనపై వచ్చిన అలిగేషన్స్ పై విచారణ జరపాలంటూ పేర్కొన్నారు. నిందితుల్లో అమాయకులు, దోషులు ఇద్దరూ ఉంటారని, అందుకే సమగ్ర దర్యాప్తు అవసరం అని అన్నారు. తాజాగా హేమా కమిటీపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం సీనియర్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మహిళా నటులు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.