iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటుడు సిద్ధిఖీపై నటి లైంగిక ఆరోపణలు.. AMMA సెక్రటరీ పదవికి రాజీనామా

మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తుంది జస్టిస్ హేమ కమిటీ నివేదిక. మాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ పేర్కొంది. ఈ క్రమంలో ప్రముఖ నటుడిపై మరోసారి లైంగిక ఆరోపణలు చేసింది నటి. దీంతో..

మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తుంది జస్టిస్ హేమ కమిటీ నివేదిక. మాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ పేర్కొంది. ఈ క్రమంలో ప్రముఖ నటుడిపై మరోసారి లైంగిక ఆరోపణలు చేసింది నటి. దీంతో..

ప్రముఖ నటుడు సిద్ధిఖీపై నటి లైంగిక ఆరోపణలు.. AMMA సెక్రటరీ పదవికి రాజీనామా

మీటూ ఉద్యమం ఊపందుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు గురించి పలువురు స్టార్స్ తమ గళాన్ని విప్పారు. ఇప్పుడు తాజాగా మలయాళ ఇండస్ట్రీలో ఈ ధోరణీ ఎక్కువైందని జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో పెను దుమారమే రేగుతుంది మాలీవుడ్‌లో. ఈ క్రమంలో కొంత మంది లేడీ యాక్టర్స్ బయటకు వచ్చి వేధింపులు, ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న వివక్ష వంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, నిర్మాత సిద్దిఖీపై నటి తీవ్రమైన ఆరోపలు చేసిందో నటి రేవతి సంపత్. ఈ క్రమంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఇంతకు యాక్ట్రెస్ ఏమని అలిగేషన్స్ చేసిందంటే..

2019లో నటి రేవతి సంపత్.. సిద్దిఖీ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది. అప్పటి నుండి అతడిపై అలిగేషన్స్ చేస్తూనే ఉంది.  ‘ 2016లో తన 21 సంవత్సరాల వయస్సులో తన కొడుకుతో ఓ తమిళ సినిమా తెరకెక్కిస్తున్నానని, సినిమా ప్రాజెక్ట్ గురించి మాట్లాడే నెపంతో నకిలీ సోషల్ మీడియా ఖాతా ద్వారా సిద్దిఖీ నన్ను సంప్రదించాడు. తొలుత కూతురు అని పిలిచేవాడు. దీంతో అనుమానం రాలేదు. కానీ ఆ తర్వాతే నాపై లైంగిక దాడి చేశాడు. సుఖమరియతే సినిమా ప్రివ్యూ అనంతరం మస్కట్ హోటల్‌కు రమ్మని పిలిచాడు. అక్కడకు వెళ్లగా కమిట్ మెంట్ అడిగాడు. ఎదురుతిరిగినందుకు నాపై దాడి చేశాడు. గంట సేపు నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేనే కాదు నా స్నేహితులకు కూడా అతడి నుండి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అప్పటి నుండి నా కలను వదులుకోవాల్సి వచ్చింది. మానసికంగా కుంగిపోయాను. ఇలాంటివి మళ్లీ జరగకూడదు’ అంటూ కామెంట్స్ చేసింది.

సిద్ధిక్‌ తనను లైంగికంగా వేధించాడని రేవతి సంపత్ పునరుద్ఘాటించిన మరుసటి రోజు ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. ఇన్నాళ్లు జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేసి తాజాగా ఆ లేఖను AMMA ప్రెసిడెంట్ మోహన్ లాల్‌కు అందచేశాడు. ‘నాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నేను పదవి నుండి వైదొలగుతున్నాను’ అంటూ ఆదివారం ఉదయం తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు. ఎడవెల బాబు రాజీనామా చేయడంతో రెండు నెలల క్రితమే సంఘం ప్రధాన కార్యదర్శిగా సిద్ధిక్ ఎన్నికయ్యారు. ఎడవెల బాబుపై కూడా ఓ జూనియర్ ఆర్టిస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. సిద్దిఖీ గతంలో తెలుగులో అంతిమ తీర్పు.. నా బంగారు తల్లి మూవీలో నటించారు. నా బంగారు తల్లి మూవీలో పర్వర్డడ్ రోల్‌లో నటించిన సంగతి విదితమే.