iDreamPost
android-app
ios-app

నాకు ఎన్నో రిలేషన్ షిప్స్ ఉన్నాయి.. నేను సీరియల్ డేటర్‌ని : రెజీనా

  • Published Sep 13, 2024 | 5:53 PM Updated Updated Sep 13, 2024 | 5:53 PM

Regina Cassandra: 14 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెజీనా కసాండ్రా.. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీలో ఉంది. తాజాగా ఆమె నటించిన ఉత్సవం మూవీ రిలీజైంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న రెజీనా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Regina Cassandra: 14 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెజీనా కసాండ్రా.. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీలో ఉంది. తాజాగా ఆమె నటించిన ఉత్సవం మూవీ రిలీజైంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న రెజీనా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

  • Published Sep 13, 2024 | 5:53 PMUpdated Sep 13, 2024 | 5:53 PM
నాకు ఎన్నో రిలేషన్ షిప్స్ ఉన్నాయి.. నేను సీరియల్ డేటర్‌ని : రెజీనా

టాలీవుడ్, కోలీవుడ్ ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రాను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. 14 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది..ఇప్పుడు అదే చరిష్మాను కంటిన్యూ చేస్తుంది. తాజాగా ఆమె నటించిన ఉత్సవం మూవీ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా హీరో హీరోయిన్లుగా అర్జున్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన డ్రామా మూవీ ఉత్సవం. హార్న్ బల్ పిక్చర్స్ పై సురేష్ పాటిల్ నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, నాజర్ వంటి స్టార్ యాక్టర్స్ నటించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా రెజీనా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఈ సందర్భంగా గతంలో తనపై వచ్చిన రూమర్స్, పలు విషయాల గురించి చెప్పింది రెజీనా.

‘14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. చదువుకుంటూనే సినిమాలు చేశాను. కాలేజీకి వచ్చాకే సినిమా ఇండస్ట్రీ కెరీర్‌గా మార్చుకోవాలనుకున్నా. ఎన్నో అప్ అండ్ డౌన్స్ వచ్చాక.. ఈ ఇండస్ట్రీ మనకొద్దు అనుకున్నాను. కానీ వెళ్లలేకపోయాను. ఈ సినిమా షూటింగ్ అంతా ఫన్నీగా సాగిపోయింది. కొత్త అబ్బాయితో వర్క్ చేయడం ఎంతో ఎనర్జటిక్ అనిపించింది. నేను కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో డైలాగ్స్ బై హార్ట్ చేసేదాన్ని. ప్రాప్టింగ్ చెప్పుకునేదాన్ని. అలా తెలుగు నేర్చుకున్నా’ అని పేర్కొంది. ఇక తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది రెజీనా. తన రియల్ లైఫ్‌లో వచ్చే అబ్బాయి.. రెస్పాన్స్ బుల్‌గా ఉండాలి.. తనను బాగా చూసుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తనకు వచ్చిన ప్రపోజల్స్, రిలేషన్ షిప్స్ గురించి వెల్లడించింది.

Rezina

‘నా జీవితంలో ఎన్నో రిలేషన్ షిప్స్ ఉన్నాయి. నేను సీరియల్ డేటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రిలేషన్ షిప్స్‌కు దూరంగా ఉన్నాను. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను. అందులో దాచడం ఎందుకు. నాకు బ్యాక్ ఫైర్ కూడా అవుతుంది. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్, వాళ్ల పేరెంట్స్ కూడా ఏంటీ ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అనుకుంటారు. నేను స్ట్రైట్ ఫార్వెడ్‌గా ఉండటమే ఇష్టం’ అని పేర్కొంది. సందీప్ కిషన్‌తో వచ్చిన పెళ్లి రూమర్స్ గురించి మాట్లాడుతూ..‘ మేమిద్దరం టామ్ అండ్ జెర్రీలా. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. 2012 నుండి మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది’ అని పేర్కొంది. సాయి ధరమ్ తేజ్ వెరీ కామ్ అండ్ స్వీట్ పర్సన్ అంటూ వెల్లడించింది రెజీనా. అదే విధంగా తన పేరు వెనుక ఉన్న సీక్రెట్ కూడా రెజీనా రివీల్ చేసింది. మా అమ్మ క్రిస్టియన్, నాన్న ముస్లిమని, ఇద్దరు డివోర్స్ తీసుకోగా.. అమ్మ నాకు ఓ నవల్లోని క్యారెక్టర్ కాసాండ్రా పేరును పెట్టిందని చెప్పింది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibom