iDreamPost
android-app
ios-app

వేరు కాపురం రచ్చలో జ్యోతికపై నిందలు! ఇంత అన్యాయమా?

  • Author ajaykrishna Published - 12:55 PM, Mon - 25 September 23
  • Author ajaykrishna Published - 12:55 PM, Mon - 25 September 23
వేరు కాపురం రచ్చలో జ్యోతికపై నిందలు! ఇంత అన్యాయమా?

కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో స్టార్ కపుల్ సూర్య – జ్యోతిక ముంబైకి మకాం మార్చడం గురించి ఎన్నో కథనాలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ ఒకటిగా పేరొందిన సూర్య, జ్యోతిక.. అన్నివిధాలా సెలబ్రిటీలకు, అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కెరీర్ ఆరంభంలో కలిసి సినిమాలలో నటించిన వీరిద్దరూ.. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ.. భర్త, పిల్లలను చూసుకుంటూ వస్తోంది జ్యోతిక. అలాంటిది కొన్నాళ్ళుగా ముంబైలో ఇల్లు కొనుకున్న వార్తలు వచ్చినప్పటి నుండి సూర్య.. జ్యోతికల గురించి ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చేసాయి.

చెన్నై నుండి ముంబైకి మకాం మార్చడం వెనుక జ్యోతికనే ప్రధాన కారణమని.. ఇన్నాళ్లు ఉమ్మడిగా కలిసి ఉన్న ఫ్యామిలీని విడగొట్టిందని కామెంట్స్ చేశారు. జ్యోతిక కారణంగానే ఎప్పుడూ నవ్వుతూ కలిసుండే సూర్య, కార్తీ ఒకరికొకరు దూరం అవుతున్నారని విమర్శలు గుప్పించారు. రీసెంట్ గా సూర్య, జ్యోతిక పిల్లలతో పాటు ముంబైకి షిఫ్ట్ అయిపోయారు. అప్పటినుండి జ్యోతికపై ట్రోలింగ్ ఇంకా ఎక్కువ అయిపోయింది. కానీ.. ఎంత ట్రోల్ చేసినా.. ఎన్ని నిందలు వేసినా సూర్య ఫ్యామిలీ నుండి ఎవరు స్పందించలేదు. కానీ.. తాజాగా కార్తీ స్పందించి క్లారిటీ ఇవ్వడంతో విమర్శలకు ఫుల్ స్టాప్ పడింట్లయిందని చెప్పాలి.

అసలు సూర్య, జ్యోతిక ఎందుకు ముంబైకి షిఫ్ట్ అయ్యారో చెప్పుకొచ్చాడు. “మా అన్నతో పెళ్లి తర్వాత నేను వదినను నటిగా చూడలేదు. ఎప్పుడూ ఓ తల్లిగానే చూశాను. ఆమె కూడా మమ్మల్ని అమ్మగానే ఆదరిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆమె ముంబైలో ఉండటంతో ఇల్లంతా బోసినట్లు ఉంది. ఆమె ఉన్నప్పుడే ఎంతో ఆనందంగా ఉన్నాం. పైగా ఇన్నేళ్లు మేం ఉమ్మడిగా కలిసున్నాం అంటే కారణం అమ్మ జ్యోతికనే. కానీ.. పిల్లలు పెద్ద వాళ్లు అవుతున్నారు. వారి చదువుల కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. పిల్లల చదువు పూర్తయ్యాక మళ్లీ తిరిగి ఇక్కడికే వస్తారు. ఈలోపు పండుగలకు కలుస్తుంటాం” అని క్లారిటీ ఇచ్చేసాడు. దీంతో ఇప్పుడు సూర్య ఫ్యామిలీ అమ్మలా భావిస్తున్న జ్యోతికపై ఇన్నాళ్లు నిందలు వేసిన తమిళ వర్గాలు సైలెంట్ అయిపోయాయి. మరి జ్యోతిక గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş