Sreeleela: ఈ మధ్యకాలంలో ఆ అవకాశం శ్రీలీల ఒక్కదానికే దక్కింది!

ఈ మధ్యకాలంలో ఆ అవకాశం శ్రీలీల ఒక్కదానికే దక్కింది!

  • Author ajaykrishna Updated - 12:48 PM, Mon - 25 September 23
  • Author ajaykrishna Updated - 12:48 PM, Mon - 25 September 23
ఈ మధ్యకాలంలో ఆ అవకాశం శ్రీలీల ఒక్కదానికే దక్కింది!

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస అవకాశాలతో ట్రెండ్ సృష్టిస్తున్న హీరోయిన్ ఎవరంటే.. శ్రీలీల పేరే వినిపిస్తుంది. చేతినిండా సినిమాలతో ఈ యంగ్ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టడీస్ కూడా బాలన్స్ చేస్తూ.. అమ్మడు దూసుకుపోతుంది. ప్రెజెంట్ రిలీజ్ కి రెడీ అయిన సినిమాల నుండి త్వరలో సెట్స్ పైకి వెళ్తున్న సినిమాల వరకు అన్నింటిలో శ్రీలీలనే కనిపిస్తుంది. అయితే.. ప్రస్తుతం శ్రీలీల చేతిలో డజనుకు పైగా సినిమాలున్నాయట. అందువల్ల కొత్తగా వస్తున్న ఆఫర్స్ ఏవి కూడా ఓకే చేసే పరిస్థితి కనిపించడం లేదట.

ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్స్ కంప్లీట్ చేసుకోగా.. మరికొన్ని సెట్స్ పైకి వెళ్లే దశలో ఉన్నాయి. అయితే.. ఇప్పుడున్న సినిమాలకు షెడ్యూల్స్ కి డేట్స్ అడ్జెస్ట్ చేయడమే కష్టంగా ఉందట. అలాంటిది కొత్త సినిమాలకు డేట్స్ ఇవ్వడం అంటే మరింత కష్టమైన పని. సో.. చేసేదేం లేక ఎంత పెద్ద సినిమాలకైనా నో చెప్పక తప్పట్లేదట. ఇప్పటికే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో సినిమా ఓకే చేసుకొని.. కాల్ షీట్స్ లేకపోవడం వల్ల తప్పుకుందట. అదే పరిస్థితి సేమ్ రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాకు వచ్చిందట. దాంతో ఆ సినిమా కూడా డేట్స్ లేక వదులుకోవడం జరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అసలు ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య ఇప్పుడున్న రేసులో.. ఒకటి రెండు సినిమాలు వస్తేనే కళ్ళకు అద్దుకొని హీరోయిన్స్ ఓకే చేసేస్తున్నారు. కొందరు కెరీర్ మొదలైన కొన్నాళ్ళకే దుకాణం సర్దేస్తున్నారు.. ఇండస్ట్రీలో ప్రస్తుతం రెండు రకాల హీరోయిన్స్ ట్రెండ్ అవుతున్నారు. వారెవరంటే.. అవకాశాలు ఎక్కువై వదులుకుంటున్న వారు, అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నవారు. వీటిలో ప్రస్తుతం శ్రీలీల మొదటి రకంలో ఉంది. ఈ మధ్యకాలంలో ఒకే హీరోయిన్ కోసం పదికి పైగా సినిమాలు ఓకే అయి.. మరికొన్ని వెయిటింగ్ లిస్ట్ లో ఉండటం ఇదే ఫస్ట్ టైమ్. అంటే.. ఎవరికీ దక్కని ఛాన్స్ శ్రీలీలకే దక్కిందని చెప్పవచ్చు. అవకాశం వస్తే కళ్ళకు అద్దుకొని ఓకే చేయాల్సింది.. ఏకంగా రిజెక్ట్ చేసే స్థాయికి ఎదిగింది శ్రీలీల. మరి శ్రీలీల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments