iDreamPost
android-app
ios-app

రజాకార్ తొలి వీకెండ్ ఎంత వసూళ్లు చేసిందంటే..?

Razakar Movie First Weekend Collections... నైజాం ప్రైవేట్ సైన్యం సాగించిన అరాచకాలను తెరపైకి చూపించిన చిత్రం రజాకార్. మార్చి 15న విడుదలైన ఈ చిత్రం తొలి వీకెంట్ ఎంత కలెక్షన్ చేసిందంటే..?

Razakar Movie First Weekend Collections... నైజాం ప్రైవేట్ సైన్యం సాగించిన అరాచకాలను తెరపైకి చూపించిన చిత్రం రజాకార్. మార్చి 15న విడుదలైన ఈ చిత్రం తొలి వీకెంట్ ఎంత కలెక్షన్ చేసిందంటే..?

రజాకార్ తొలి వీకెండ్ ఎంత వసూళ్లు చేసిందంటే..?

చరిత్రలో నిలిచిపోయిన సంఘటనలు ఆధారంగా ఇటీవల కాలంలో సినిమాలు రూపొందుతున్నాయి. ఆ కోవలోకే వస్తుందీ రీసెంట్‌గా డీసెంట్ హిట్ కొట్టిన రజాకార్ మూవీ. 1940లో దేశమంతా స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న కాలంలో.. హైదరాబాద్ సంస్థానానికి చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఏర్పాటు చేసిన ప్రైవేట్ సైన్యమే ఈ రజాకార్లు. ఆ సమయంలో వీరు చేసిన ఘోరాలు అంతా ఇంతా కాదూ.. అత్యంత దారుణంగా ప్రజలను హింసించేవారు. మహిళల్ని బహిరంగంగా అత్యాచారాలకు పాల్పడేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా హైదరాబాద్ సంస్థానికి రాలేదు. చివరికి పోరాడటంతో హైదరాబాద్ సంస్థానం .. దేశంలో విలీనం అయ్యింది. ఆ సమయంలో రజాకార్లు సాగించిన అరాచకాన్ని ‘రజాకార్’ పేరుతో తెరకెక్కించారు.

యాట సత్యనారాయణ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. ఆ సమయంలో రజాకార్లు సాగించిన అరాచకాన్ని తెరపై చూసి.. బరువెక్కిన హృదయాలతో బయటకు వచ్చారు. ఆ రోజుల్లో నిజాం ప్రైవేట్ ఆర్మీ సాగించిన ఆగడాలను చూసి చలించిపోయారు. మరికొంత మంది మరిన్ని వాస్తవాలను తెరకెక్కించలేదన్న వాదన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ..ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ వస్తుంది. బాబీ సింహ, తేజా సప్రు, వేదిక, అనసూయ భరద్వాజ్, ఇంద్రజ, ప్రేమ కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రానికి.. సమీర్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై గుడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను చూసి యాంకర్ సుమ ప్రశంసించిన సంగతి విదితమే.

razakar collections 2

టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన ఈ చిత్రం.. థియేటర్ల దగ్గర బాగానే వసూళ్లను రాబట్టుకుంటుంది. రూ. 2.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ తొలి వీకెండ్ ముగిసే సరికి 73 లక్షల షేర్ రాబట్టుకుంది. సినిమా గట్టేక్కాలంటే.. మరో రూ. 1.47 కోట్ల షేర్ అవరసరం. అయితే అదే సమయంలో వీటి కలెక్షన్లకు గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమలు, భీమా, గామి చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేస్తుండటంతో.. దీని ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదని చెప్పొచ్చు. నైజాంలోనే 0.34 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఏపీ, తెలంగాణ కలుపుకుని 66 లక్షలను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 0.73 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టుకోగలిగింది. ఇక ఈ చివరి వీకెండ్ వరకు ఎంత వసూలు చేస్తుందో వెయిట్ చేయాలి.