Tirupathi Rao
మాస్ మహరాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు రూపంలో ప్రేక్షకులకు మరో హిట్టు చిత్రాన్ని అందించారు. ఆంధ్రా రాబిన్ హుడ్ గా పేరొందిన నాగేశ్వరరా పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు. కానీ, ఈ సినిమా నుంచి రవితేజ ఒక పాఠాన్ని నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మాస్ మహరాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు రూపంలో ప్రేక్షకులకు మరో హిట్టు చిత్రాన్ని అందించారు. ఆంధ్రా రాబిన్ హుడ్ గా పేరొందిన నాగేశ్వరరా పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు. కానీ, ఈ సినిమా నుంచి రవితేజ ఒక పాఠాన్ని నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tirupathi Rao
మాస్ మహరాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావుగా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ లభించింది. ప్రయోగాలు చేయడం, కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడం వంటి అంశాల్లో మాత్రం రవితేజ ముందుంటాడు. ఇంక రవితేజ ఎనర్జీ గురించి అయితే తెలుగు ఆడియన్స్ కి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇంత మంచి హిట్టు కొట్టిన రవితేజకు.. టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి ఒక పాఠం అయితే నేర్చుకోవాల్సి ఉందని చెబుతున్నారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా ఒక బయోపిక్ అని అందరికీ తెలిసిందే. ఆంధ్రా రాబిన్ హుడ్.. గజదొంగ గరిక నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఆ రోజుల్లో స్టువర్టుపురంలో మనుషుల పరిస్థితి ఎలా ఉంది? అడవిలో జీవిస్తున్న వారిని జనజీవన స్రవంతిలో కలిపి.. దొంగలు అయ్యేలా ఎలా చేశారు? గతిలేక వాళ్లు దొంగలుగా మారితే.. అక్కడ కూడా వారి బతుకులను ఎలా వాడుకున్నారు? అనే అన్ని అంశాలను స్పష్టంగా తెరకెక్కించారు. ఈ విషయంలో డైరెక్టర్ వంశీకి ప్రేక్షకుల నుంచే కాదు.. విమర్శకుల నుంచి కూడా ప్రసంశలు దక్కాయి.
ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రథమార్థం మొత్తం చూస్తున్నంత సేపు మీకు అసలు రవితేజ హీరోనా? విలనా? అనే ఒక అనుమానం రాకమానదు. కొన్ని సీన్లలో రవితేజను అసలు ఊహించుకోలేకపోయాం అంటున్నారు. తండ్రి తలనరకడం, తనని నమ్ముకుని చిలకలూరిపేటలో నాలుగు వేశ్యా గృహాలు బతుకుతున్నాయి అనడం, పిలిస్తే రాలేదని వేశ్యను కాలితో తన్నడం ఇలాంటి దృశ్యాలు చూసి ప్రేక్షకులు నివ్వెరపోయారు. అయితే తర్వాత అన్నీ మరోపాత్ర దృష్టికోణంలో చూపించినట్లుగా చెప్పారు. కానీ, అప్పటికే ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. అచ్చం ఇలాంటి ప్రయోగమే రవితేజ.. రావణాసుర సినిమాలో కూడా చేశాడు. ఒక హీరోయిన్ తో ప్రవర్తించిన తీరును ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. అసలు రవితేజను అలాంటి ఒక పాత్రలో ఊహించుకోలేకపోయాం అంటూ చెప్పుకొచ్చారు. రావణాసుర సినిమా కూడా హిట్ అయినప్పటికీ కొన్ని సీన్ల విషయంలో ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు మళ్లీ అలాంటి ఒక ప్రయోగాన్నే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా చేశారు. నిజానికి ఇలాంటి కొన్ని సీన్స్, ఎలిమెంట్స్ ని టచ్ చేయకపోతేనే బాగుండు అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అయితే డైరెక్టర్ స్క్రీన్ ప్లేని చాలా పకడ్బందీగానే రాసుకున్నాడు. నిజానికి మెప్పించే విధంగా రాసుకున్నాడు. కానీ, సీన్లను చూసినప్పుడు మాత్రం మాస్ ఇమేజ్ ఉన్న రవితేజను అలాంటి ఒక సన్నివేశంలో ఆడియన్స్ చూడలేకపోయారు. అలాంటి ఒకటి రెండు సీన్స్ లేకపోతే టైగర్ నాగేశ్వరరావు సినిమాకి ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చేది అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా రవితేజ.. టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి ఒక పాఠం అయితే నేర్చుకోవాలంటున్నారు. అదేంటంటే.. ఒక ప్రయోగాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు అంటే దానిని మళ్లీ రిపీట్ చేయకుండా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.