iDreamPost
android-app
ios-app

’కణం‘లో సాయి పల్లవి, శౌర్యల కూతురు గుర్తుందా..? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

  • Published Sep 04, 2024 | 12:35 PM Updated Updated Sep 04, 2024 | 12:35 PM

సాయి పల్లవి, నాగ శౌర్య హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కణం. ఇది బైలింగ్వల్ మూవీ. తమిళంలో దియాగా వచ్చింది. ఎఎల్ విజయ్ తెరకెక్కించాడు. ఇందులో సాయి పల్లవి కూతురుగా నటించిన పాప గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

సాయి పల్లవి, నాగ శౌర్య హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కణం. ఇది బైలింగ్వల్ మూవీ. తమిళంలో దియాగా వచ్చింది. ఎఎల్ విజయ్ తెరకెక్కించాడు. ఇందులో సాయి పల్లవి కూతురుగా నటించిన పాప గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

  • Published Sep 04, 2024 | 12:35 PMUpdated Sep 04, 2024 | 12:35 PM
’కణం‘లో సాయి పల్లవి, శౌర్యల కూతురు గుర్తుందా..?  ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో, డ్యాన్సుతో క్రష్ బ్యూటీగా మారిపోయింది. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళుతుంది. కెరీర్ తొలినాళ్లలో తల్లి పాత్రలు చేసేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోదు. కానీ సాయి పల్లవి ఇందుకు మినహాయింపు.  ఆమె అమ్మగా కనిపించిన మూవీ కణం. ఇది బైలింగ్వల్ మూవీ. తమిళంలో దియా పేరుతో రిలీజైంది. 2018లో విడుదలైన ఈ మూవీ ఓకే అనిపించింది. నాగ శౌర్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు. లైరా ప్రొడక్షన్స్ పతాకంపై ‘కణం’తెరకెక్కగా.. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు. సొంత తండ్రిపై చనిపోయిన కూతురు పగ తీర్చుకుంటే అనే కాన్సెప్టుతో మూవీ తెరకెక్కింది. తన చావుకు కారణమైన బంధువులను చంపేస్తుంది శౌర్య, సాయి పల్లవి డాటర్ దియా.

దియా చుట్టూనే కథ తిరుగుతుంది. యుక్త వయస్సులో హీరో హీరోయిన్లు తులసి, కృష్ణ (సాయి పల్లవి, నాగ శౌర్య) చేసిన తప్పు వల్ల..గర్భవతి అవుతుంది తులసి. పెళ్లి కాకుండా తల్లి అవుతుందని తెలిసిన వారి పేరెంట్స్ ఆమెకు అబార్షన్ చేయిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటికీ గర్భస్థ పిండంగా చనిపోయిన దియా పెద్దదై..దెయ్యం రూపంలో రివేంజ్ తీర్చుకుంటుంది. సాయి పల్లవికి కూతురుగా నటించిన చిన్నారి వెరోనికా అరోరా. చాలా చక్కని అభినయంతో ఈ మూవీలో ఆకట్టుకుంది. వెరోనికా ఢిల్లీకి చెందిన అమ్మాయి. వెరోనికా పూర్తి పేరు.. వెరోనికా రుచికా అరోరా. ఈమె చిన్నప్పటి నుండి మోడల్‌గా రాణించింది. కోల్‌గేట్, స్నాప్‌డీల్, సోనీ, మారుతి , కిండర్ జాయ్ వంటి ప్రకటనల్లో నటించింది. 2018లో మరాఠీ డ్రామా చిత్రం ఆమ్హి దోగీతో సినీ ఎంట్రీ ఇచ్చింది వెరోనికా.

అంతకుముందు ద బెంచ్ అనే షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించింది. కణం తర్వాత ఆమె తమిళంలో ఓ చిత్రం చేసింది. దర్శకుడు సి సుందర్ తెరకెక్కించిన హార్రర్ మూవీ అరణ్మనై చిత్రంలో కనిపించింది ఇందులో రాశీ ఖన్నా చిన్నప్పటి పాత్రలో మెరిసింది వెరోనికా. ఆర్య, ఆండ్రియా, సాక్షి అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో వర్క్ చేశారు. తెలుగులో అంత: పురం పేరుతో రిలీజైంది. గత ఏడాది ఓ హిందీ చిత్రంలో మెరిసింది. . మొత్తంగా ఇటు చదువు, ఇటు మోడల్, నటిగా రాణిస్తుంది. ప్రస్తుతం ఈ చిన్నారి పెద్దదయ్యింది. వెరోనికా ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తుంది. ఢిల్లీలోని జనక్ పురిలో ఉన్న మహారాజా సూరజ్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. సోషల్ మీడియాలో రీల్స్,షాట్స్ చేస్తూ యాక్టివ్‌గా వ్యవహరిస్తోంది. చూడబోతే.. మరికొన్ని రోజుల్లో హీరోయిన్ అయిపోవడం పక్కాగా అనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Veronika Ruchika Arora (@ruchika_tahil21)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş